Plebiscite
-
కశ్మీర్లో ప్లెబిసైట్ సంగతేంటి?
చెన్నై: జమ్మూకశ్మీర్‌లో ఇంకా ప్లెబిసైట్(ప్రజాభిప్రాయ సేకరణ) ఎందుకు నిర్వహించలేదని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రశ్నించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులను క్రీడా ప్రముఖుల తరహాలో కీర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఎన్నడూ ఆ దారిలో నడవకూడదని అభిప్రాయపడ్డారు. చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కమల్.. సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడి సహా పలు అంశాలపై యువతీయువకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ..‘ప్రతీఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు చేపట్టాల్సిన ప్లెబిసైట్‌ను కశ్మీర్లో ఇంకా ఎందుకు చేపట్టలేదు? ఎందుకు భయపడుతున్నారు? మన దేశం 1947లో రెండు ముక్కలుగా విడిపోయింది. ఎవరితో ఉంటారో జమ్మూకశ్మీర్ ప్రజలను మీరు(ప్రభుత్వం)ఇంకోసారి ఎందుకు అడగరు? రాజకీయ నాయకులు ఈ పని చెయ్యరు’ అని తెలిపారు. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ‘సాధారణగా ఎవరిౖనా రక్తస్రావమైతే తొలుత దాన్ని ఆపాలి. ఆ తర్వాతే సర్జరీకి(సర్జికల్ స్ట్రైక్స్‌కు) ఏర్పాట్లు చేసుకోవాలి. ఆజాద్ కశ్మీర్(పీవోకే)లో రైళ్లపై జీహాదిస్టుల పోస్టర్లు దర్శనమిస్తుంటాయి. ఉగ్రవాదులను ప్రముఖ క్రీడాకారుల తరహాలో అక్కడ కీర్తిస్తుంటారు. ఇలాంటి మూర్ఖపు చర్యలను భారత్ పునరావృతం చేయకూడదు. ఎందుకంటే పాక్ కంటే భారత్ చాలా మెరుగైన దేశం’ అని అన్నారు. ‘మీ తల్లిదండ్రులు ఆర్మీలో చేరొద్దని సూచిస్తే వారికి ఒకటే చెప్పండి. ప్రతిఏటా ఆర్మీలో కంటే తమిళనాడులో రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నారు. అర్హులైనవారు చాలా ఉన్నతస్థానాలకు వెళ్లవచ్చు. కానీ ఆర్మీలో చేరాలన్న ధైర్యం మీకు ఉందా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. రాజకీయ నేతలు సక్రమంగా ప్రవర్తిస్తే సరిహద్దులో సైనికులు చనిపోవాల్సిన అవసరమే ఉండదు’ అని అన్నారు. -
కశ్మీర్‌పై ప్లెబిసైట్ కు పాక్ ప్రధాని డిమాండ్
ఇస్లామాబాద్: కశ్మీర్.. భారత అంతర్గత విషయం కాదని, దీనిపై భారత్ ప్లెబిసైట్ నిర్వహించాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు. కశ్మీరీల హక్కులను భారత్ గౌరవించాలని, వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని అన్నారు. బుధవారాన్ని (జూలై 20) చీకటి రోజుగా అభివర్ణించారు. ఐరాస సమావేశంలోనూ కశ్మీర్ విషయాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. -
బెల్లంపల్లిని జిల్లా చేయూల్సిందే
ప్రజాభిప్రాయ సేకరణలో నినదించిన ప్రజలు బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్ : తూర్పు ప్రాంతం కూడలిలో ఉన్న బెల్లంపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కొత్త జిల్లా ఏర్పాటుకు బెల్లంపల్లి మాత్రమే అనువైన ప్రాంతమని, బెల్లంపల్లి జిల్లా కోసం ప్రభుత్వానికి తగిన నివేదిక పంపించాలని పెద్ద పెట్టున నినదించారు. బుధవారం బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మం దిరంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఆరీ ్డవో ఆయేషామస్రత్‌ఖానం అధ్యక్షత వహిం చారు. ప్రజాభిప్రాయ సేకరణ ఆధ్యంతం భావోద్వేగం, ఆగ్రహావేశాల మధ్య జరిగింది. నిప్పులు చెరిగిన గుండా మల్లేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. విధి, విధానాలు, మార్గదర్శకాలు లేకుండా ప్రభుత్వం మంచిర్యాలను జిల్లా చేస్తామని ప్రకటిచండంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా జిల్లాల పేర్లను ప్రకటించడం ఆక్షేపణీయమన్నారు. బెల్లంపల్లి పేరును కొత్త జిల్లా కోసం కలెక్టర్ ప్రతిపాదించినా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల విభజన జరగడం లేదన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేయడంతో చుట్టు పక్కల ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన మ్యాప్‌లో మధ్యస్తంలో ఉన్న బెల్లంపల్లి కనిపించడం లేదా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తీరుగా చూసినా ప్రభుత్వం బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాల్సిందేనన్నారు. మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లు ప్రకటించడం సరికాదన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరపడం సరికాదన్నారు. ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి ఎస్.కృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి చిప్ప నర్సయ్య, జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, బీజేపీ నాయకులు సకినాల నారాయణ, రాజమల్లు, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కటకం సతీశ్, బెల్లంపల్లి జిల్లా సాధనోద్యమ సమితి నాయకులు నీరటి రాజన్న తదితరులు మాట్లాడుతూ, కొత్త జిల్లా ఏర్పాటుకు మంచిర్యాలకు ఉన్న అర్హతలేమిటి, బెల్లంపల్లికి ఉన్న ప్రతికూల అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. బెల్లంపల్లిని జిల్లాగా సాధించుకోవడానికి ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టి, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అంతకుముందు బెల్లంపల్లి జిల్లా చేయాలని కోరుతూ అఖిలపక్షం, రాజకీయ పక్షాలు, వ్యాపార, వాణిజ్యవర్గాలు పోటాపోటీగా ఆర్డీవో ఆయేషామస్రత్‌ఖానంకు వినతిపత్రాలు అందజేశారు. బెల్లంపల్లి జిల్లా భావన వ్యక్తమైంది : ఆర్డీవో బెల్లంపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే భావన ప్రజాభిప్రాయ సేకరణలో సంపూర్ణంగా వ్యక్తమైందని మంచిర్యాల ఆర్డీవో ఆయేషామస్రత్‌ఖానం తెలిపారు. ఆమె మాట్లాడుతూ, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజన కోసం ప్రభుత్వం కసరత్తును ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు వివరిం చారు. బెల్లంపల్లి తహశీల్దార్ కె.శ్యామలదేవి, ఎంపీడీవో మహేందర్, రాజకీయ, ప్రజా, కుల, కార్మిక, వ్యాపార తదితర సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
విభజనపై ప్రజాభిప్రాయ సేకరణకు ఆదేశించండి
* సుప్రీంకోర్టులో పిల్ దాఖలుచేసిన అడుసుమిల్లి జయప్రకాశ్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి ముందు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించేలా, అలాగే రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలుసుకొనేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. దీన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేశారు. విభజన అంశంపై రెండో రాష్ట్రాల పునర్విభజన కమిటీ (ఎస్సార్సీ) ఏర్పాటు చేసేలా కేంద్రానికి మార్గనిర్దేశం చేయాలని ఆ పిటిషన్లో విన్నవించారు. సీమాంధ్ర, తెలంగాణలో మాండలికం భిన్నమనే వాదన తప్పని ఈ పిటిషన్లో ప్రస్తావించారు. రాష్ట్రంలో 28 విభిన్న తెలుగు మాండలికాలు వాడుకలో ఉన్నాయని, వాటిలో 12 తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నది స్వచ్ఛమైన తెలుగేనని, అది ఏ ప్రాంత మాండలికమో కాదని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం 53 ఏళ్లుగా ఉద్యమం జరుగుతుందన్న వాదన కూడా వాస్తవం కాదని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1969 వరకు ఎలాంటి ఉద్యమాలూ జరగలేదని నివేదించారు. 1969లో జరిగినప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన తెలంగాణ ప్రజాసమితి 1971లో కాంగ్రెస్ పార్టీలో విలీనమైందని పేర్కొన్నారు. మళ్లీ 2009లోనే ఉద్యమం జరిగిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కావాలనే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా సరైన ఆధారమేమీ లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆమోదయోగ్యంగా ‘విభజన’ను పరిష్కరించాలి: హైకోర్టులో పిల్ దాఖలు. సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల సందేహాలను నివృత్తి చేసి, మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి డి.నరేంద్రరెడ్డి శనివారం ఈ పిల్ దాఖలు చేశారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయంతో సీమాంధ్రలో అశాంతి ఏర్పడిందని, ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్ధిరపడిన సీమాంధ్రుల భద్రత, ఉద్యోగుల సందేహాలు, నీటి సమస్యను పరిష్కరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషన్లో కేంద్ర హోం శాఖ కార్యదర్శిని ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ పిల్ సోమవారం విచారణకు రానుంది.