పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలు పరిష్కరించాలి
ఖిలా వరంగల్ : తెలంగాణ కళా, వృత్తివిద్యలను గౌరవించాలని, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యలు పరిష్కరించాలని పీటీఐ జేఏసీ రాష్ట్ర ఆధ్యక్షుడు టి.కేశవకుమార్, ముఖ్యసలహాదారు తిరువరంగం ప్రభాకర్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కోరారు. బుధవారం హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో కడియంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లను ఏడాది కూడా రీ ఎంగేజ్ చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన వారిలో పీటీఐ జేఏసీ నాయకులు కృష్ణహరి, శరత్, లక్ష్మణ్, రాధిక, యాకయ్య ఉన్నారు.