శింబుకు జోడీ ఎవరో?
శింబు చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలమైంది. పోడాపోడినే తెరపైకొచ్చిన ఆయన చివరి చిత్రం. అది ఆశించిన విజయం సాధించలేదు. దీపావళికి విడుదలవుతుందనుకున్న వాలు చిత్రం తెరపైకి రాలేదు. దీంతో శింబు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యూ రు. అయితే తన అభిమానుల్ని అలరించడానికి శింబు సిద్ధమయ్యారు. ఈసారి తనే సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టారు. శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందే చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి హీరోరుున్ను ఇంకా ఎంపిక చేయలేదట. దర్శకుడు మాట్లాడుతూ శింబుకు జంటగా నటించే హీరోయిన్ ఇంకా దొరకలేదన్నారు. ఏంజిల్ లాంటి ఒక అందమైన నటి కావాలని పేర్కొన్నారు. అలాంటి బ్యూటీ కోసం తీవ్రంగా అన్వేషణ సాగుతోందని వివరించారు. ఈ చిత్రానికి శింబు సోదరుడు కురళరసన్ సంగీతం అందించడం విశేషం.