హుజూరాబాద్ జిల్లా కోరుతూ నేడు ధర్నా
నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి
జమ్మికుంట : హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గురువారం జమ్మికుంటలో ధర్నా, రాస్తారోకో చేపడుతున్నట్లు నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి కోరారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించేలా ఈ ప్రాంత ప్రజలు, అఖిలపక్ష పార్టీల నాయకులు ఉద్యమించాలని కోరారు. ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ధర్నా అనంతరం వందలాది వాహనాల్లో హైదరాబాద్ వెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లాగా ప్రకటించకుంటే ఆందోళనలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, దయ్యాల శ్రీనివాస్, పోతుల లింగయ్య, టీఆర్ఎస్ నాయకులు రావికంటి రాజు, పిట్టల రమేశ్, కొమ్ము అశోక్, జామీర్, పాషా తదితరులు పాల్గొన్నారు.