మంత్రి తీరు.. మహిళలు బేజారు!
ఆలూరు రూరల్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీరుతో పొదుపు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రన్న పెట్టుబడి నిధి చెక్కుల కోసం ఆలూరుతో పాటు ఆయా గ్రామాలకు చెందిన పొదుపుగ్రూపు మహిళలు బుధవారం ఉదయం 10 గంటలకే స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కళామందిరానికి వచ్చారు.
మహిళలకు 10:30 గంటలకు చెక్కులు అందించాల్సి ఉంది. అయితే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని..మంత్రి మధ్యాహ్నం ఒంటిగంటకు చెక్కుల పంపిణీకి వచ్చారు. మంత్రి వచ్చే వరకు మహిళలు ఉండాల్సిందే అంటూ.. ఐకేపీ సిబ్బంది వారిని బయటకు వెళ్లకుండా తలుపులు వేశారు. ఎవరూ బయటకు వెళ్లకుండా కుర్చీలో కూర్చోబెట్టి మంత్రి సమావేశం ముగిసేదాకా ఐకేపీ సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు.