'హిందీ పాట సాహిత్య విలువలు కోల్పోతోంది'
ప్రముఖ గాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమార్ సోను బాలీవుడ్ పాటలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ' ఈ మధ్య వస్తున్న హిందీ సినిమా పాటల్లో సాహిత్య విలువలు కనిపించటం లేదు. 90ల పాటలను అప్పటి సాహిత్యం, మెలోడీ కారణంగా ఇప్పటికీ మనం గుర్తుకు చేసుకుంటున్నాం. కానీ ప్రస్తుత పాటలకు అలాంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పటికీ ప్రాంతీయ భాషా చిత్రాల్లో కాస్త విలువలు కనిపిస్తున్నాయి.
మార్పు అవసరమే, సంగీతంలో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది.. పాటలు ఎప్పుడు సాహిత్యం కారణంగానే ఎక్కువగా కాలం నిలిచి ఉంటాయి. ఈ జనరేషన్ మంచి పాటలు అందించటం లేదని కాదు.. కానీ గతంలో పది లో తొమ్మిది పాటలు బాగుంటే ఇప్పుడు రెండే బాగుంటున్నాయి'. అంటూ ఈ జనరేషన్ హిందీ పాటలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.