polio eradication
-
పోలియోపై పోరుకు రూ.9.8 వేల కోట్ల విరాళం
బెర్లిన్: ప్రపంచ వ్యాప్తంగా పోలియో మహమ్మారిపై సాగే పోరాటానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.8 వేల కోట్ల)సాయం ప్రకటించింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలను పోలియో రహితంగా మార్చేందుకు, వైరస్ కొత్త వేరియంట్ల వ్యాప్తిని నివారణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తామని తెలిపింది. పోలీయో నిర్మూలన కోసం ఇప్పటి వరకు 5 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు వెల్లడించింది. పోలీయోపై పరిశోధనలు, కొత్త వేరియంట్ల గుర్తింపు సహా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఇటీవలే పాకిస్తాన్లో 20, అఫ్గానిస్తాన్‌లో 2 పోలీయో కేసులు నమోదైన క్రమంలో ఆయా దేశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపింది. ప్రపంచం ఈ మహమ్మారిని అంతం చేస్తానని మాటిచ్చిందని, ఏ ఒక్కరు ఈ వ్యాధిపై భయంతో జీవించకూడదంటూ ట్వీట్ చేసింది బిల్ అండ్ మెలిండా గేట్స్. The world made a promise to #EndPolio for good. No one should live in fear of this preventable disease. The Gates Foundation is proud to commit $1.2B toward helping health workers stop all forms of this virus and protect children forever. https://t.co/oA7RNzcOIy — Gates Foundation (@gatesfoundation) October 16, 2022 ఇదీ చదవండి: Bill Gates: ఫౌండేషన్‌కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్! -
ఆనందంగా ఉంది:అమితాబ్ బచ్చన్
ముంబై: పోలియో నిర్మూలనలో తాను ఒక భాగమైనందుకు ఆనందంగా ఉందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలిపారు. భారతదేశంలో దాదాపు పోలియోను నిలువరించినందుకు, అందులో తాను ఒక భాగస్వామినైందుకు ఆయన సంతోషంగా వ్యక్తం చేశారు. 2005వ సంవత్సరంలో యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల నిధి) పోలియో నిర్మూలన బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్ ను నియమించింది. అప్పట్నుంచి నుంచి పోలియో నిర్మూలన కార్యక్రమానికి యూనిసెఫ్ ప్రతినిధిగా ఉన్న అమితాబ్.. ఈ బాధ్యత ఎంతో సంతృప్తినిచ్చిందన్నాడు. ఈ ఎనిమిది సంవత్సరాల ప్రయాణం తనకు చాలా హాయిగా ఉందన్నాడు. భారత్ లో పోలియో నిర్మూలన కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. -
పోలియో నిర్మూలనకు సహకరించాలి
బెలగాం, న్యూస్‌లైన్:పోలియో నిర్మూలనకు ప్రజలు సహకరించాలని వ్యాధి నిరోధక, టీకాల జిల్లా అధికారి డాక్టర్ ఎం. కిశోర్‌కుమార్ కోరారు. గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో పార్వతీపురం డివిజన్లో గల ‘పల్స్‌పోలియో’ రూట్ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 19న బూత్కేంద్రాల వద్ద 20, 21తేదీలలో ఇంటింటికీ వెళ్లి 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. రెండు లక్షల 22 వేల మంది చిన్నారులకు చుక్కల మందు జిల్లా వ్యాప్తంగా 2,22,572 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్క చిన్నారికీ చుక్కల మందు వేయాలని, ఈ విషయంలో ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 1600 బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే 160 మంది సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు, గ్రామాల్లో 3,200 బృందాలు, మెడికల్ ఆఫీసర్లతో 66 మొబైల్ టీమ్‌లు, మెడికల్, విద్యాశాఖ, ఐసీడీఎస్, ఆశ, తదితర విభాగాల నుంచి 6,400 మంది సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతంలో 38,832 మంది పిల్లలు లక్ష్యం కాగా 497 బూత్‌లు 994 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఎన్సీ ఎస్పీహెచ్ఓ డాక్టర్ ఎం.నారాయణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చొక్కాపు రామారావు, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ.లక్ష్మణమూర్తి, ఆరోగ్య పర్యవేక్షకులు ఎన్. కృష్ణమోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.