polka dots
-
వింతైన దృశ్యం: సముద్రంలో తెల్లటి చుక్కలు: వీడియో వైరల్
జెల్లీఫిష్‌లు గురించి అందరూ వినే ఉంటారు. వాస్తవానికి అవి మహా సముద్రాల్లో లోతైన ప్రాంతాల్లో సంచరించే ఒక రకమైన జీవి. ఈ అకశేరుకాలలో మెదుడు అనేది ఉండదు. వాటి శరీరంలో మొత్తం దాదాపు 95% నీరు ఉంటుంది. మనం మహా అయితే ఒకటో రెండో జెల్లీ ఫిష్‌లు సముద్రంలో అరుదుగా కనిపిస్తాయి. ఏకంగా పెద్ద సముహంలా జెల్లీఫిష్‌లను చూసి ఉండం. కానీ ఇజ్రాయెల్‌లోని నేషన్స్ పార్క్స్ అండ్ నేచర్ అథారిటీ ఒక అద్భుతమైన వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక పడవ చుట్టూ భారీ సముహంలా కొన్ని లక్షల జెల్లీఫిష్‌లు ఉంటాయి. పైగా అవి చూసేందుకు సముద్రంలో తెల్లటి చుక్కల వలే అందంగా కనిపిస్తాయి. చూసేందుకు భలే అద్భుతంగా ఉంటుంది. ఐతే కాలుష్యం, వాతావరణ మార్పులే ఈ జెల్లిఫిష్‌లు అధిక సంఖ్యలో పెరిగిపోవడానికి కారణమని అంటున్నారు శాస్త్రవేత్లు. ఇవి వాస్తవానికి హిందూ మహాసముద్రలో ఉద్భవించాయి. ఐతే సూయజ్ కాలువా ద్వారా తూర్పు మధ్యధరా ప్రాంతానికి చేరుకుంటాయని విశ్వసిస్తారు. శీతలికరణం కోసం సమద్రపు నీటిని వినియోగిస్తాయి. కానీ అధిక సంఖ్యలో ఉన్న ఈ జెల్లీఫిష్‌లు పవర్ స్టేషన్లో విద్యుత సరఫరాకి ప్రమాదకరంగా ఉన్నాయి. ఐతే ఈ జెల్లీ ఫిష్‌లు మానువులను కుడతాయని కొద్దిపాటి మోతాదులో విషం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇవి కుట్టిన ఒక్కోసారి అంతపెద్ద ప్రమాదం సంభవించదు గానీ కాస్త నొప్పిగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతాం. కొన్ని అరుదైన సందర్భాల్లో విపరీతమైన నొప్పి ఏర్పడి మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. (చదవండి: శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది!) -
ఫుల్‌టైమ్ పార్టీవేర్
సంప్రదాయ వేడుకలు సరేసరి. వాటి హంగులు, ఆర్భాటాలు అన్నీ ఇన్నీ కావు. ఎంత గాడీగా తయారైనా పట్టింపులేవీ ఉండవు. ప్రత్యేకత అంటే మాత్రం ఆధునిక వ్రస్త్రధారణలోనే చూపించడానికి వీలౌతుంది. గెట్ టుగెదర్, బర్త్‌డే, ఈవెనింగ్.. వంటి వేడుకలకు హాజరవ్వాలంటే ఆ పార్టీకి తగ్గ ప్రత్యేకమైన వస్త్రధారణ కచ్చితంగా ఉండాలి. అప్పుడే స్టైల్‌గా ఫ్యాషన్ తెలిసిన వ్యక్తులుగా మిమ్మల్ని మీరు నలుగురిలో స్పెషల్‌గా నిలుపుకోగలుగుతారు. అందుకే ఎండాకాలం కాటన్స్, వర్షాకాలం షిఫాన్స్ అంటూ ఒక విభాగానికే పరిమితం అవకుండా ఏ కాలమైనా, ఏ సమయమైనా పార్టీలకు ధరించడానికి అనువుగా ఉండే ‘ఫుల్‌టైమ్ డ్రెస్ వేర్’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యానిమల్ ప్రింట్స్ ఏ కాలమైనా ఎవర్గ్రీన్ స్టైల్ స్టేట్మెంట్గా యానిమల్ ప్రింట్స్‌ను చెప్పుకోవచ్చు. ట్రెండ్‌లో ట్రైబల్ ప్రింట్స్గానూ పిలుస్తున్న ఈ తరహా దుస్తులు రోజులో ఏ సమయంలోనైనా ధరించడానికి సిద్ధం అన్నట్టుగా ఉంటాయి. 1970-80ల కాలంలో యానిమల్ ప్రింట్స్ హవా బాగా నడిచింది. ఈ ప్రింట్ల నమూనా హుందాతనానికి ప్రతీకగా ఉంటుంది. అందుకే నేటికీ ఫ్యాషన్ ప్రపంచంలో తమ ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాయి ఈ ప్రింట్లు. వీటిలో ఆవు, జీబ్రా, చిరుత, జిరాఫీ, పులి, తెల్ల పులి... వీటి దేహంపై మచ్చలను పోలిన ఫ్యాబ్రిక్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. ♦ కాటన్, సిల్క్, షిఫాన్ ఇలా అన్ని రకాల క్లాత్లమీదా యానిమల్ ఫ్రింట్స్ వస్తున్నాయి. ♦ చీరలు, టాప్స్, కుర్తీలు, గౌన్ల మీద సంప్రదాయ, ఆధునిక వస్త్రధారణగానూ ఈ ప్రింట్స్‌ను ధరించవచ్చు. అయితే, పాశ్చాత్య వేడుకలకే ఈ చారలు మరింత ప్రత్యేకతను ఇస్తున్నాయి. ♦ డ్రెస్సుల్లోనే కాకుండా ఇతర అలంకరణ వస్తువుల్లోనూ యానిమల్ ప్రింట్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వీటిలో స్కార్ఫ్స్, సన్‌గ్లాసెస్, హ్యాండ్‌బ్యాగులు, బెల్టులు, పర్సులు, పాదరక్షలు.. ఇలా అన్నింటిలోనూ యానిమల్ ప్రింట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ♦ బాలీవుడ్ తారలు ఎక్కువగా చుక్కల యానిమల్ ప్రింట్లు గల డిజైనర్ దుస్తులు ధరిస్తుంటారు. అంతర్జాతీయ బ్రాండ్లలోనే కాదు, స్వదేశీ ఫ్యాషన్ డిజైనర్లూ ఈ చుక్కల ఫ్యాబ్రిక్‌తో ఆకట్టుకునే డిజైన్లను రూపొందిస్తున్నారు. పోల్కా డాట్స్ ♦ యానిమల్ ప్రింట్స్ మాదిరే పోల్కా డాట్స్ కాలాలకు అతీతంగా నిలిచిన ఫ్యాషన్ ఫ్యాబ్రిక్. ఆధునిక వస్త్రధారణలో అందంగా నిలిచిపోయిన పోల్కాడాట్స్ యువతరపు మదిని దాదాపు నూరేళ్లుగా గిలిగింతలు పెడుతూనే ఉంది. ♦ చిట్టి పొట్టి గౌన్లలోనే కాదు, పొడవు మ్యాక్సీలలోనూ, చీరలలోనూ, టాప్స్లోనూ, ప్యాంట్స్లోనూ తమవైన హవా సృష్టిస్తూనే ఉన్నాయి నలుపు, తెలుపు చుక్కలు. ♦ పొడవాటి పోల్కా డాట్స్ గౌన్ మీ వార్డ్‌రోబ్‌లో ఉంటే ఏ పార్టీ అయినా ఎవర్రెడీ అన్నట్టు ఉండవచ్చు. ♦ డ్రెస్సుల్లోనే కాదు బ్యాగులు, మెడకు చుట్టుకునే స్కార్ఫ్స్, తలకు వాడే రిబ్బన్లు, పాదరక్షల్లోనూ పోల్కాడాట్స్ ఉండటం చూస్తుంటాం. ఇవి ఒక సెట్‌గా ఉంటే రెట్రో ఫ్యాషన్‌లో మీరు తలుక్కుమన్నట్టే. సదా ‘సాదా’యే... ప్లెయిన్‌గా పై నుంచి కిందవరకు ఎలాంటి డిజైన్ లేకుండా సింపుల్ అనిపించే ఒక లాంగ్ గౌన్ ధరించినా చాలు ‘అల్ట్రామోడ్రన్’ మార్కులు కొట్టేయచ్చు. పాశ్చాత్య సుందరీమణుల వస్త్రజాబితాలో ప్రాచీనకాలం నుంచీ చోటుచేసుకుని ఉన్న ఈ తరహా వేషధారణ ఇప్పుడూ ప్రత్యేక స్థానంలో ఉంది. అందుకే ఈ తరహా సాదా డ్రెస్సులను ఏ కాలంలోనైనా, ఏ సందర్భానికైనా ఆధునిక వేడుకలకు ధరించవచ్చు. సిల్క్, శాటిన్, బ్రొకేడ్, షిఫాన్, క్రేప్, జార్జెట్, ఆర్గంజా, రేయాన్, వెల్వెట్.. ఫ్యాబ్రిక్స్ ఈ తరహా గౌన్లకు బాగా నప్పుతాయి. అయితే... ♦ గౌన్ పూర్తి ప్లెయిన్‌గా ఉంటుంది కాబట్టి, మెడలో వేసుకునే హారం ‘ఫంకీ’ తరహాకి చెందినదై, మెడను పట్టి ఉంచేలా ఉండాలి. ♦ చెవులకు సన్నని లోలాకు లు, కాళ్లకు హై హీల్స్ తప్పనిసరి. సింపుల్‌గా అనిపించే మేకప్ పార్టీలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపుతుంది. ♦ గౌన్ సాదాగా ఉంటుంది కాబట్టి పాదరక్షలు ప్రింట్లున్నవి ఎంచుకోవచ్చు. లేదా బెల్ట్, చేత ధరించే క్లచ్.. ప్రింట్లున్నవి వాడితే బాగుంటుంది. మోడల్ అండ్ డ్రెస్ కర్టెసి : ఎడార్న్ స్టూడియో, హైదరాబాద్ -
చుక్కనమ్మలు
ఎలాంటి ఫ్యాషన్లు ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి? అమ్మాయిలు ఫాలో అయ్యేవా? అమ్మాయిల్ని ఫాలో అయ్యేవా? అమ్మాయిల్ని ఫాలో అయ్యేవే! నైన్టీన్ సిక్స్టీస్ నుంచి ‘పోల్కా’ అనే ఒక ఫ్యాషన్... అమ్మాయిల్ని ఫాలో అవుతూ వస్తోంది. వాళ్ల బట్టల్నీ, తట్టాబుట్టల్నీ, గోళ్ల రంగుల్నీ... చుక్కలు చుక్కలుగా డిజైన్ చేస్తూ చక్కనమ్మలుగా ముస్తాబు చేస్తోంది. వాళ్ల ఇష్టాయిష్టాలను తెలుసుకుని గౌరవ మర్యాదలు పొందుతోంది. దీన్ని బట్టి ఏం అర్థమౌతోంది? అమ్మాయిల్ని ఫాలో అవాలంటే ఒక స్టేచర్, ఒక డిగ్నిటీ ఉండాలని కదా! ఆ రెండూ పోల్కాకి ఉన్నాయి కనుకనే... ఈవారం ఈ టాపిక్. గుండ్రటి, పెద్ద పెద్ద చుక్కలు అన్నీ ఒకే పరిమాణంలో, సమానమైన దూరంలో కనిపిస్తాయి. తమ మధ్యా ఒక బంధం ఉందన్న భావనను తెలుపుతుంటాయి. ఆ భావనే పోల్కా ప్రింట్కు ప్రాణం అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. మొదట స్విమ్‌సూట్ మీద ఊపిరిపోసుకున్న ఈ చుక్కలు ఆ తర్వాత పిల్లల దుస్తులు మొదలుకొని ఆధునికం నుంచి సంప్రదాయం వరకు అన్నింటా పాకిపోయాయి. పోల్కా డాట్స్‌కు సామాన్యులే కాదు రాజకీయ నాయకులూ దాసోహమన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్, ప్రస్తుత ప్రదాని టోనీ బ్లేయర్ తమ డ్రెస్ నెక్ భాగంలో పోల్కా డాట్స్ ఉండేలా డిజైన్ చేయించుకునేవారు. 1950లో గ్లామర్ క్వీన్ మార్లిన్ మన్రో తన దుస్తుల్లో పోల్కాకు ప్రత్యేకమైన స్థానమిచ్చారు. అనుకరణే ఆయుధం: రెట్రో ఫ్యాషన్‌కి అతి పెద్ద దారిని చూపాయి పోల్కా డిజైనర్ దుస్తులు. వీటిలో ఉండే స్పార్క్ అత్యంత వేగంగా దుస్తుల నుంచి యాక్ససరీస్ వరకు పాకింది. ‘చుక్కలు ఎప్పుడైతే ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చాయో, అప్పుటి నుంచి మనమూ వాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాం’ అంటారు ప్రఖ్యాత డిజైనర్ సత్యపాల్! దానికి తగ్గట్టే లుక్ ఎలా కావాలంటే అలా మారిపోతుంది పోల్కా డ్రెస్ ధరిస్తే! పోల్కా ప్రింటెడ్ బ్లౌజ్ ధరించి, సాదా చీర కట్టినా, సాదా జాకెట్టు వేసి పోల్కా చుక్కల చీర కట్టినా ఆ అందమే వేరు. అలాగే ప్యాంట్ షర్ట పైన చుక్కల ఓవర్ కోట్ వేసి, సన్ గ్లాసెస్ పెడితే చాలు అల్ట్రామోడ్రన్గానూ వెలిగిపోవచ్చు. జీన్స్ పై పోల్కా: చుక్కల డిజైనింగ్‌లో తమదైన ముద్ర వేయాలనుకుంటే చుక్కల ప్రింట్స్ నచ్చిన దుస్తుల మీద ఫ్యాబ్రిక్ పెయింట్‌తో వేసుకోవచ్చు. బ్లూ, బ్లాక్ జీన్స్, జెగ్గింగ్స్ పైనా పోల్కా చుక్కలను వేసి, సరికొత్త లుక్‌తో మీరు మెరిసిపోవచ్చు. డిజైనర్స్ ఫేవరేట్ పోల్కా: జార్జెట్, షిఫాన్, క్రేప్, బ్రాసో.. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీదా అందంగా ఒదిగిపోయే సుగుణం పోల్కా చుక్కల సొంతం. అందుకే డిజైనర్ల పాలిట అదృష్టంగా మారింది పోల్కా. సెలబ్రిటీల అందచందాలను మరింతగా చూపించడానికి పోల్కాను ప్రధానంగా వాడుతున్నారు డిజైనర్లు. ర్యాంప్ పై చుక్కలను చుట్టుకున్న చక్కనమ్మలు చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతూ డిజైనర్లకు హ్యాట్సాప్ చెబుతున్నారు. పోల్కాతో జిమ్మిక్కులు చేసే డిజైనర్లలో రోహిత్‌బాల్, సవ్యసాచి, సత్యపాల్ వంటి ప్రముఖులూ ఉన్నారు. పోల్కా డాట్స్ డ్రెస్సింగ్ గురించి వారు చెబుతున్న కొన్ని సూచనలు.. మీ వార్డ్ రోబ్‌లో ఒక్క పోల్కా డ్రెస్ లేదా ఏ ఒక్క యాక్ససరీ ఉన్నా చాలు. వెస్ట్రన్ పార్టీకి 5 నిమిషాల్లో రెడీ అయిపోవచ్చు. ప్లెయిన్ డ్రెస్ ధరించి ఒక్క టోపీ వాడితే చాలు. లేదంటే అదే ప్లెయిన్ డ్రెస్‌కు పోల్కా చుక్కలు ఉన్న బెల్ట్ ఉపయోగించినా అల్ట్రామోడ్రన్ అనిపిస్తారు. కాటన్ షూ, శాండల్స్, చెప్పల్స్, బ్యాగ్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్... ఏ చిన్న అలంకరణ వస్తువైనా పోల్కాకు స్థానమిస్తే ఆ లుక్ రిఫరెంట్ అనిపించకమానదు. పోల్కా డ్రెస్ వేసుకుంటున్నాం కదా! అని టాప్ టు బాటమ్ ‘ఇదే తరహా’లో వెళ్లాలనుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే అలంకరణలో ఏదో ఒక ఎలిమెంట్కే ప్రాధాన్యం ఇవ్వడం మేలు.