పాలీసెట్-2016 నోటిఫికేషన్ విడుదల
- రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఏప్రిల్ 21న 268 కేంద్రాల్లో పరీక్ష
-1.30 లక్షల దరఖాస్తులు రావచ్చని అంచనా
హైదరాబాద్ సిటీ: వివిధ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికై రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి(ఎస్బీటీఈటీ) నిర్వహించే పాలీసెట్-2016 సోమవారం విడుదలైంది. నోటిఫికేషన్ మేరకు మంగళవారం నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 268 పరీక్షాకేంద్రాల్లో ఏప్రిల్ 21న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పాలీసెట్-2016 పరీక్ష జరగనుంది. గతేడాది 1.03లక్షల దరఖాస్తులు రాగా, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న పాలిటెక్నిక్ కోర్సుల పట్ల ఈ ఏడాది విస్తృత ప్రచారం చేసినందున 1.30లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలీసెట్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌కు గడువు తేది ఏప్రిల్ 10గా నిర్ణయించారు. గడువు తర్వాత ఫైన్‌తో గానీ, తత్కాల్ పద్ధతిన గానీ దరఖాస్తులు తీసుకునే అవకాశం లేదు. పరీక్ష ముగిశాక రెండు రోజుల్లోగా కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తామని, మే 3న ఫలితాలతో పాటు తుది కీని కూడా వెల్లడిస్తామని ఎస్బీటీఈటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు.
పాలిటెక్నిక్‌లలో హెల్ప్‌లైన్ కేంద్రాలు
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా అన్ని ఏపీ ఆన్లైన్ కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన పాలిటెక్నిక్‌లలో సహాయ(హెల్ప్‌లైన్) కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న అభ్యర్థులు తమ ఇంటి నుంచే ఞౌడఛ్ఛ్ట్టిట.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్‌కు సంబంధించిన దరఖాస్తు నమూనా, ఇతర వివరాల బుక్లెట్ కోసం టఛ్ట్ఛ్ట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు నమూనాలో కోరిన వివరాలను నింపి ఏపీఆన్‌లైన్, పాలిటెక్నిక్‌లలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వాటిని సమర్పించవచ్చు. ఇంకనూ ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు టోల్ ఫ్రీ నెంబరు 1800 599 5577 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 330 కాగా, ఎస్సీఎస్టీ అభ్యర్థులకు గతంలో ఉన్న దరఖాస్తు ఫీజు రూ.330ను ఈ ఏడాది ప్రప్రథమంగా రూ.165కు తగ్గించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 58,880 సీట్లున్నాయి.
------------------------------
జిల్లాల వారీగా ఎంపిక చేసిన పరీక్షాకేంద్రాలు..
జిల్లా పేరు పరీక్షా కేంద్రాలు కెపాసిటీ(అభ్యర్థులు)
----------------------------------
మహబూబ్‌నగర్ 24 11,740
నల్గొండ 24 12,040
ఖమ్మం 28 15,822
వరంగల్ 37 17,802
అదిలాబాద్ 25 8,830
కరీంనగర్ 40 18,978
నిజామాబాద్ 22 8,250
మెదక్ 20 10,305
రంగారెడ్డి 17 8,400
హైదరాబాద్ 41 20,750
----------------------------------
మొత్తం 268 1,32,921