పూలే విగ్రహం ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తా
పూలే జయంతి సభలో మంత్రి జోగురామన్న
హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై పూలే విగ్రహం ఏర్పాటు విషయుంపై వుుఖ్యవుంత్రితో చర్చిస్తానని రాష్ర్ట వెనుకబడిన తరగతుల సంక్షేవు శాఖ వుంత్రి జోగురావున్న చెప్పారు. సోమవారం రవీంద్రభారతిలో మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలు జరిగాయి. పూలే జయంతి ఉత్సవ కమిటీ నిర్వహించిన ఈ ఉత్సవంలో మంత్రి జోగు రామన్నతో పాటు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, చింతల రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘పూలే ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాం. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పైనా లేక అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంగణంలో నెలకొల్పాలా అన్నది సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయిస్తాం. అలాగే పది జిల్లాల్లో బీసీ భవన్లు, ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. కళాశాలల వసతి గృహాలు నెలకొల్పతాం. ప్రతి జిల్లాకూ ఒక స్టడీ సర్కిల్ అందుబాటులోకి తెచ్చి అందులో ఏడాదంతా శిక్షణ కొనసాగేలా చర్యలు తీసుకొంటాం. బీసీ కార్పొరేషన్ కింద పదివేల మందికి రుణాలు మంజూరు చేశాం. ఈ ఏడాది 50 వేల మందికి తగ్గకుండా రుణాలు ఇస్తాం. కుల సంఘాల సదస్సులు నిర్వహించుకొనేలా ఆడిటోరియం నిర్మిస్తాం. త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తాం’ అని చెప్పారు.
ప్రభుత్వాన్ని నిందించడం తగదు...
స్వామిగౌడ్ మాట్లాడుతూ... ఏమీ చేయలేదని ప్రభుత్వాన్ని నిందించడం కంటే బీసీల అభ్యన్నతికి మనమేం చేస్తున్నామో ఆలోచించాలన్నారు. పూలే ఆశయ సాధనకు పాటుపడకుండా బీసీలను అగ్రవర్ణాలు అణగదొక్కుతున్నాయనడం సరికాదన్నారు. జన్మతః సంక్రమించే హక్కులను కూడా పోరాటం చేసి సాధించుకోవడం దురదృష్టకరమని ఆర్ కృష్ణయ్య అన్నారు. అనంతరం బీసీ హాస్టల్లో చదువుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆనంద్‌ను సత్కరించారు. ఉత్సమ కమిటీ చైర్మన్ రామరాజు, వైస్‌చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రతినిధి సోమేశ్‌కుమార్, బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
పూలే కృషి స్ఫూర్తిదాయకం...
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అధ్యక్షతన అంబర్‌పేట చౌరస్తాలో జరిగిన పూలే జయంతి ఉత్సవంలో మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. అనంతరం పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అంబర్‌పేట చే నంబర్ చౌరస్తాలో జ్యోతిరావుపూలే పేరిట ఆడిటోరియాన్ని నిర్మించాలన్న వీహెచ్ మంత్రిని కోరగా, సీఎం దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు.