poornima
-
మా నాన్న ముందే గొల్లపూడి నా చెంప పగలగొట్టాడు: నటి
బాలనటిగా కెరీర్ ఆరంభించిన పూర్ణిమ సింగర్ అవుదామనుకుంది. కానీ కాలం, ఆమెలోని నటనా చాతుర్యం ఆమెను నటిని చేసింది. 'శ్రీవారికి ప్రేమలేఖ', 'ముద్దమందారం', 'నాలుగు స్తంభాలాట', 'పుత్తడిబొమ్మ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' వంటి సినిమాలతో హీరోయిన్గా అలరించింది. ఆ తర్వాత సహాయక పాత్రలు సైతం పోషించి తెలుగువారి మనసుల్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పూర్ణిమ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా పేరు మలయాళంలో సుధ, తెలుగులో పూర్ణిమ. నేను సింగర్ అవుదామనుకున్నా, కానీ నటినయ్యా. హీరోయిన్గా చేస్తున్నప్పుడే కృష్ణగారికి చెల్లెలిగా కూడా చేశా. సావిత్రిగారితో కూడా నటించాను. ఆమె చనిపోయే ముందు రోజుల్లో.. పాన్ తింటూ ఇలా యాక్ట్ చేయాలి, అలా చేయాలని సూచనలిచ్చేవారు. ఇక నేను సినిమా ఆర్టిస్ట్ అని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఆరు సంబంధాలు వచ్చినదారినే వెళ్లిపోయాయి. నాకింక లైఫ్‌లో పెళ్లవదు, కుమారిగానే మిగిలిపోతాననుకున్నా. కానీ 1998లో నాకు పెళ్లైంది. నాలుగు స్తంభాలాట సినిమా సమయంలో వైజాగ్ అందాలు చూసివద్దామని నేను, నరేశ్ బైక్‌పై వెళ్లి వస్తుండగా చున్నీ టైర్లో చుట్టుకోవడంతో కింద పడిపోయా, గాయాలయ్యాయి. నన్ను అలా చూసి నరేశ్ కంట్లో నీళ్లు తిరిగాయి. 'మనిషికో చరిత్ర' సినిమా సెట్స్‌లో గొల్లపూడి మారుతీరావు నన్ను సీరియస్‌గా కొట్టేశారు. అక్కడే ఉన్న మా నాన్న మా అమ్మాయిని ఎందుకు కొట్టారు? అని మారుతీరావును నిలదీశాడు. అందుకాయన నాకు కూతుర్లు లేరమ్మా, అందుకే కొట్టేశాను అని చెప్పడంతో ఊరుకున్నాడు' అని చెప్పుకొచ్చింది పూర్ణిమ. -
క్యాన్సర్‌తో భారత మాజీ షూటర్ పూర్ణిమ మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ ఎయిర్ రైఫిల్ షూటర్, కోచ్ పూర్ణిమ జనానే (42) కన్నుమూసింది. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమె పుణేలో శనివారం తుదిశ్వాస విడిచింది. భారత్ తరఫున పూర్ణిమ పలు ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలు, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో జాతీయ రికార్డు తన పేర లిఖించుకున్న ఆమె కోచ్‌గానూ రాణించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ అవార్డు’ను గెలుచుకుంది. ఆమె మృతి పట్ల భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ), బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, భారత మాజీ రైఫిల్ షూటర్ జాయ్దీప్ కర్మాకర్ సంతాపం వ్యక్తం చేశారు. -
నగరానికి చేరుకున్న పూర్ణిమ సాయి
-
ఇంకా లభ్యం కాని పూర్ణిమ ఆచూకీ
-
మిస్టరీగా బాలికల ‘మిస్సింగ్’
హైదరాబాద్ (జగద్గిరిగుట్ట): మైనర్ బాలికల వరుస మిస్సింగ్ కేసులు బాచుపల్లి పోలీసులకు సవాలుగా మారాయి. ఓ కేసు దర్యాప్తులో మునిగి ఉండగానే మరో మిస్సింగ్ కేసు నమోదవుతోంది. ఈ నెల 7న నిజాంపేటకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి పాఠశాలకు వెళ్లింది. అప్పటినుంచీ ఆచూకీ లభించలేదు కదా కనీసం చిన్న క్లూ కూడా దొరకక పోవడం పోలీస్ వర్గాలతో పాటు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి ఇటు సైబరాబాద్.. అటు రాచకొండ కమిషనరేట్ల పరి«ధిలో విస్తృతంగా గాలిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలోని సీసీ ఫూటేజీలకు పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల సైబరాబాద్ క్రైమ్ డీసీపీ జానకి షర్మిల నిజాంపేటలోని పూర్ణిమ సాయి ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. వైజాగ్, యానం ప్రాంతాలకు పూర్ణిమ వెళ్లి ఉండవచ్చనే అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన నేపధ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో ఘటనలో నిజాంపేట కేటీఆర్ కాలనీకి చెందిన ప్రసాద్ కుమార్తె దుర్గాదేవి (14) ఈ నెల 11న కిరాణా దుకాణానికి వెళ్లి అదృశ్యమైంది. ఇప్పటి వరకు ఆ బాలిక కూడా తిరిగి రాలేదు. ఇంకా నిజాంపేటలోని బండారు లేఅవుట్లో నివాసముండే శ్యాంసుందర్‌రెడ్డి కుమార్తె యామిని(16) ఈ నెల 11న బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైంది. యామిని ఖమ్మంలోని తన స్వగ్రామం వెళ్లినట్లు తెలిసింది. పూర్ణిమ, దుర్గాదేవిల మిస్సింగ్‌లు మిస్టరీగానే మారాయి. -
ఎఫెక్షన్.. పర్ఫెక్షన్
పెళ్లి, కుటుంబం, పిల్లల పరిరక్షణ, సమాజంలో పురుషుల భాగస్వామ్యం, ఘనతలు, విజయాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగే ‘ఇంటర్నేషనల్ మెన్స్ డే’. అదే సమయంలో వారిపై జరుగుతున్న దురాగతాలు, వివక్షనూ ప్రశ్నిస్తోంది ఈ దినోత్సవం. ప్రపంచంలో అరవైకి పైగా దేశాల్లోని మగవారు ఏటా నవంబర్ 19న దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దారులు వేరైనా... సమాజంలో కనీస మానవ విలువలు పాటించే దిశగా ప్రోత్సహించడమే ఈ డే అసలు ఉద్దేశం. ఈవారం ‘క్యాంపస్ కబుర్లు’లో టాపిక్ కూడా ఇదే. నాడు- నేడు... కుటుంబంలో మగవారి పాత్ర, అనుబంధం, అవగాహనలో వచ్చిన మార్పులు, తీరుతెన్నులపై రాంకోఠి ‘జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ’ విద్యార్థులు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. మై ఇన్స్పిరేషన్... అమ్మ కంటే నాన్నతోనే ఎక్కువ అటాచ్మెంట్. అమ్మ ఎంత గారాం చేసినా నాన్న పిలుపులో ఏదో కమ్మదనం. హ్యాపీ, అన్‌హ్యాపీ... ఏదైనా మొదట నాన్నతోనే షేర్ చేసుకుంటా. ఇంట్లో ఉంటే... చటుక్కున వెళ్లి నాన్న ఒడిలో కూర్చొని మాట్లాడతా. బయట ఉంటే ఫోన్ చేస్తా. మై ఫాదర్ ఈజ్ మై బెస్ట్ బడ్డీ... ఇన్స్పిరేషన్. అమ్మ కంటే నాన్నకు ఓర్పు కూడా ఎక్కువే. ఎవర్నైనా ప్రేమించినా... అతడి కంటే మా నాన్నకే ముందు చెబుతా. - పూర్ణిమ అన్నింటికీ నాన్నే .. మా నాన్నంటే నాకో క్లోజ్ ఫ్రెండ్‌లా అనిపిస్తారు. సినిమాలకు వెళ్లాలన్నా, షాపింగ్‌కు వెళ్లాలన్నా.. అన్నింటికీ డాడీతోనే. కానీ... మా నాన్నకు వాళ్ల నాన్నను చూస్తే షివరింగట. ఏం కావాలన్నా అమ్మమ్మని కిచెన్‌లోకి తీసుకెళ్లి... సీక్రెట్‌గా అడిగేవారట. నాకా ఇబ్బందులు లేవులేండి. నాన్న నాతో ఎంతో కూల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారు. కాలేజీ విషయాలు కూడా ఆయనతో డిస్కస్ చేస్తా. ఐయామ్ డ్యాడ్స్ క్యూటీ పెట్! - మానస ఇప్పుడంతా షేరింగ్... జనరేషన్ బట్టి జనాల్లో చాలా మార్పులొచ్చాయి. తాతల కాలంలో అమ్మమ్మ ఇంట్లో వంటావార్పూ చూసుకొనేది. తాతయ్య ఉద్యోగం చేసి సాయంత్రానికి ఇంటికొచ్చేవాడు. ఆడవారు వంటింటికే పరిమితమవడం వల్ల నాడు వారికి లోకజ్ఞానం తక్కువగా ఉండేది. ఇప్పుడు... ఇద్దరూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే కష్టాన్ని ఇద్దరూ షేర్ చేసుకొంటున్నారు. పిల్లలకు లగ్జరీ లైఫ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. - మహ్మద్ అబ్దుల్ సిరాజ్ నో ఆర్గ్యుమెంట్స్... నేటితరంలో అంతా చదువుకున్నవారే. సో... అందరిలో పద్ధతి, కూల్ గోయింగ్, సింపుల్నెస్తో లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా రెస్పాండ్ అయ్యే ముందు ‘ఎందుకు’ అని ఓసారి ఆలోచిస్తే అంతా కూల్‌గా సాగిపోతుంది. చాలా గొడవలు తగ్గిపోతాయి. సంబంధాలు గట్టిపడతాయి. అలాకాక ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ పోతే మనసులు వికలమై... సంబంధాలపై ప్రభావం చూపుతాయి. ఆ సెన్స్‌తోనే నేటి యువకులు మసులుకుంటున్నారనేది నా అభిప్రాయం. - మహ్మద్ అష్రాఫ్ఖాన్ మాటల్లో చెప్పలేను... కామన్‌గా ఫాదర్స్ పిల్లల్ని చదివిస్తారేమో! కానీ మా నాన్న అలా కాదు... నా రికార్డ్స్, ప్రాజెక్ట్స్... అన్నింట్లో సాయం చేస్తారు. అమ్మ జాగ్రత్తలు చెబుతుంది. కానీ నాన్న... ఏం జరిగినా నేనున్నానంటూ ధైర్యాన్నిస్తారు. కుటుంబ బాధ్యతల్లో మగవాళ్లకి అంత పేషెన్స్, డెడికేషన్ ఉండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పాపా నన్ను ఓ గాజు బొమ్మలా అపురూపంగా చూసుకుంటారు. నేటితరం మగవాళ్లలో ఆడవారిపై గౌరవం, మర్యాద, అవగాహన చాలా పెరిగాయి. - పాయల్ -
నాని బుజ్జి బంగారం మూవీ స్టిల్స్