
న్యూఢిల్లీ: భారత మాజీ ఎయిర్ రైఫిల్ షూటర్, కోచ్ పూర్ణిమ జనానే (42) కన్నుమూసింది. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమె పుణేలో శనివారం తుదిశ్వాస విడిచింది. భారత్ తరఫున పూర్ణిమ పలు ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలు, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో జాతీయ రికార్డు తన పేర లిఖించుకున్న ఆమె కోచ్‌గానూ రాణించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ అవార్డు’ను గెలుచుకుంది. ఆమె మృతి పట్ల భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ), బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, భారత మాజీ రైఫిల్ షూటర్ జాయ్‌దీప్ కర్మాకర్ సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment