Por Thozhil Movie
-
'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)
టైటిల్: పోర్ తొళిల్ నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, శరత్‌బాబు తదితరులు నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెహగల్, ముఖేష్ మెహతా, సీవీ శరత్, పూనమ్ మెహ్రా, సందీప్ మెహ్రా దర్శకుడు: విఘ్నేశ్ రాజా సంగీతం: జేక్స్ బెజోయ్ ఎడిటర్: శ్రీజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ: కాలైసెల్వన్ శివాజీ విడుదల తేది: 2023 ఆగస్టు 11 (సోనీ లివ్) థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్‌గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. అలా కొన్నాళ్ల ముందు తమిళంలో విడుదలైన 'పోర్ తొళిల్' సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. సోనీ లివ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీ స్టోరీకి తోడు సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) కథేంటి? క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇతడి దగ్గర డీఎస్పీ ట్రైనీగా పనిచేసేందుకు ప్రకాశ్(అశోక్ సెల్వన్) వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా ఉంటుంది. తిరుచ్చిలో జరిగిన ఓ మర్డర్ కేసు విచారణ బాధ్యత ఈ ముగ్గురికి అప్పగిస్తారు. దీన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. చివరకు లోకనాథన్, ప్రకాశ్, వీణ... హంతకుడిని పట్టుకున్నారా? వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు ఏం జరిగిందనేదే 'పోర్ తొళిల్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా ఏదైనా సరే దాదాపుగా రెండే అంశాలు ఉంటాయి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వీటిలో ఏదో ఓ పాయింట్ ఆధారంగానే దాదాపు అన్ని మూవీస్ తీస్తుంటారు. 'పోర్ తొళిల్'కి కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. అయితే మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే థ్రిల్. మూవీ చూస్తున్నంతసేపు మనకు అన్నీ తెలుసని అనుకుంటాం. కానీ ఏదో ఓ కొత్త ట్విస్ట్ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో మ్యాజిక్ అదే. ఫస్టాప్ విషయానికొస్తే.. రాత్రిపూట గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ చోట యువతి శవం కనిపిస్తుంది. అలా ఫస్ట్ సీన్‌తోనే దర్శకుడు నేరుగా పాయింట్లోకి తీసుకెళ్లిపోయాడు. అనంతరం ఎస్పీ లోకనాథన్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్ పాత్రల పరిచయం. మనస్తత్వాలు డిఫరెంట్‌గా ఉండే ఈ ఇద్దరు కలిసి, ఓ మర్డర్ కేసు దర్యాప్తు చేయడం, ఈ క్రమంలోనే వీళ్లకు ఆధారాలు ఒక్కొక్కటిగా దొరకడం.. ఇలా స్టోరీ చకచకా పరుగెడుతూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఓ టెంపోలో సాగిన సినిమా.. సెకండాఫ్‌లో మాత్రం మంచి ట్విస్టులతో మరో రేంజుకి వెళ్లింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని మంచి థ్రిల్ ఇచ్చే సీన్స్‌తో ఎండ్ చేయడం బాగుంది. ఓవైపు లోకనాథన్, ప్రకాశ్... మర్డర్ కేసు దర్యాప్తు చేస్తుండగానే వరుస హత్యలు జరుగుతుంటాయి. ఇక్కడ డైరెక్టర్ రాసుకున్న సీన్స్ అన్నీ కూడా సాధారణ ప్రేక్షకుడికి క్లియర్‌గా అర్థమయ్యేలా ఉంటాయి. ఫీల్డ్ ట్రైనింగ్, హత్య ఎలా జరిగిందో వివరించడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే మనం అక్కడే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ప్రకాశ్ అమాయకత్వంతో సింపుల్ కామెడీ మనల్ని నవ్విస్తుంది. సీన్స్ అన్నింటికీ క్లైమాక్స్‌కి లింక్ చేసిన విధానం బాగుంది. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ అని కాకుండా చివర్లో ఓ సందేశం ఇచ్చారు. అయితే అది చూసిన తర్వాత నిజంగానే మనుషులు ఆ ఒక్క విషయం వల్ల సైకో కిల్లర్స్‌లా మారతారా అనే డౌట్ వస్తుంది. ఎవరెలా చేశారు? ఈ సినిమాలో కనిపించే పాత్రలు చాలా తక్కువ. కాకపోతే ప్రతి ఒక్కరినీ దర్శకుడు బాగా వాడుకున్నాడు. ఎస్పీ లోకనాథన్‌గా శరత్ కుమార్, ట్రైనీ డీఎస్పీ ప్రకాశ్‌గా అశోక్ సెల్వన్ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రకాశ్ పాత్ర మొదట భయస్తుడిగా కనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మారిపోతుంది. వీణగా నిఖిల్ విమల్ బాగానే చేసింది. ఈ పాత్రకు పెద్దగా స్కోప్ లేదనుకుంటాం. కానీ మూవీ చివరకొచ్చేసరికి ఈమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. కెన్నడీగా శరత్‌బాబు రోల్ అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు. 'పోర్ తొళిల్' సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా ఉంది. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇలా ప్రతిఒక్కరూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. రైటర్ ఆల్ఫ్రెడ్ ప్రకాశ్, దర్శకుడు విఘ్నేశ్ రాజాతో కలిసి మంచి థ్రిల్లర్‌ని ప్రేక్షకులకు అందించారు. హీరోహీరోయిన్లు ఉన్నారు కదా అని లవ్ ట్రాక్ లాంటి వాటి జోలికి పోకుండా దర్శకుడు మంచి పనిచేశాడు. క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే 'పోర్ తొళిల్' బెస్ట్ ఆప్షన్. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!
బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా లేదు. ఎందుకంటే రజినీకాంత్ 'జైలర్' vs చిరంజీవి 'భోళా శంకర్' అన్నట్లు పరిస్థితి ఉంది. బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో ఈ రెండు పోటీ పడేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ లవర్స్ కోసం కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. కొన్ని ఆల్రెడీ గురువారం స్ట్రీమింగ్‌లోకి వచ్చేయగా మరికొన్ని శుక్రవారం రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయనేది లిస్ట్ చూసేయండి. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ హార్ట్ ఆఫ్ స్టోన్ - తెలుగు డబ్బింగ్ మూవీ పద్మిని - మలయాళ చిత్రం పెండింగ్ ట్రైన్ - జపనీస్ సిరీస్ బిహైండ్ యువర్ టచ్ - కొరియన్ సిరీస్ - ఆగస్టు 12 మెక్ క్యాడెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది) పెయిన్ కిల్లర్ - ఇంగ్లీష్ సిరీస్(ఆల్రెడీ స్ట్రీమింగ్) జగున్ జగున్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్) మ్యారీ మై డెడ్ బాడీ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ రెడ్, వైట్ & రాయల్ బ్లూ - ఇంగ్లీష్ సినిమా మహావీరుడు - తెలుగు డబ్బిగ్ మూవీ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 - తెలుగు సిరీస్( స్ట్రీమింగ్ అవుతోంది) సత్యప్రేమ్ కీ కథ - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) హాట్‌స్టార్ కమాండో - హిందీ సిరీస్ జియో సినిమా జరా హట్కే జరా బచ్కే - హిందీ సినిమా ఆహా వాన్ మూండ్రు - తమిళ మూవీ హిడింబ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) వేరే మారి ఆఫీస్ - తమిళ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) జీ5 అభర్ ప్రళయ్ - బెంగాలీ సిరీస్ ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ సోనీ లివ్ పోర్ తొడిల్ - తెలుగు డబ్బింగ్ సినిమా ద ఫేబుల్మన్స్ - ఇంగ్లీష్ మూవీ బ్రోకర్ - కొరియన్ చిత్రం పారాసైట్ - ఇంగ్లీష్ సినిమా లయన్స్ గేట్ ప్లే హై హీట్ - ఇంగ్లీష్ సినిమా బుక్ మై షో రుబీ గిల్మన్, టీనేజ్ క్రాకన్ - ఇంగ్లీష్ మూవీ (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!
This Week OTT Movies: ఎప్పటిలానే మరో సోమవారం వచ్చేసింది. అయితే ఈ వారం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్', రజినీకాంత్ 'జైలర్' థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల హడావుడి మొదలైపోయింది. మరోవైపు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం ఏకంగా 23 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్‌కు సిద్ధమయైపోయాయి. వాటిలో పలు మూవీస్ ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) చిరు-రజినీ సినిమాల గురించి పక్కనబెడితే ఈ వారం ఓటీటీల్లోకి మంచి మంచి థ్రిల్లర్స్ రాబోతున్నాయి. వీటిలో తమిళ బ్లాక్‌బస్టర్ 'పోర్ తొడిల్' సినిమా ఒకటి. అలానే ఒక్క పాటతో సెన్సేషన్ అయిన హిందీ చిత్రం 'జరా హట్కే జరా బచ్కే' కూడా ఈ వారమే రానుంది. అలానే హిడింబ మూవీ, మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ కూడా ఈ వారం ఓటీటీ లిస్టులో ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలు. మరి ఏయే మూవీసే ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08 అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08 జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 08 మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10 పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10 హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11 పద్మిని (మలయాళ చిత్రం) - ఆగస్టు 11 బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 12 అమెజాన్ ప్రైమ్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 10 రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11 హాట్‌స్టార్ నెయ్మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08 ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08 కమాండో (హిందీ సిరీస్) - ఆగస్టు 11 జియో సినిమా జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా) - ఆగస్టు 11 ఆహా హిడింబ (తెలుగు సినిమా) - ఆగస్టు 10 వేరే మారి ఆఫీస్ (తమిళ సిరీస్) - ఆగస్టు 10 వాన్ మూండ్రు (తమిళ మూవీ) - ఆగస్టు 11 జీ5 అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) - ఆగస్టు 11 ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 11 సోనీ లివ్ ద జెంగబూరు కర్స్ (హిందీ సిరీస్) - ఆగస్టు 09 పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 11 ఆపిల్ ప్లస్ టీవీ స్ట్రేంజ్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 09 లయన్స్ గేట్ ప్లే హై హీట్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11 (ఇదీ చదవండి: ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో) -
ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ
మంచి సినిమా ఏ భాషలో వచ్చినా సరే దాన్ని ఆదరించాలి. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు చాలామంది మూవీ లవర్స్‌కి మనసులో ఉన్నమాట. అలా వాళ్లు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిపోయింది. పేరుకే ఇది థ్రిల్లర్ సినిమా అయ్యుండొచ్చు కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే సమ్‌థింగ్ డిఫరెంట్. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) స్ట్రీమింగ్ డేట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనేది ఎప్పటికీ బోర్ కొట్టని జానర్. కరెక్ట్‌గా తీయాలే గానీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అలా తమిళంలో జూన్ 9న రిలీజై సెన్సేషన్ సృష్టించిన సినిమా 'పోర్ తొడిల్'. యంగ్ హీరో అశోక్ సెల్వన్, సీనియర్ నటుడు శరత్ కుమార్ నటించిన ఈ సినిమా.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. అయితే పోలీసులు-మర్డర్ మిస్టరీ ఇలాంటివి చాలా చూశాం కదా అని మీరనుకోవచ్చు కానీ వాటితో పోలిస్తే ఇది స్పెషల్. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 4న ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడది మారింది. ఆగస్టు 11 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. 'పోర్ తొడిల్' కథేంటి?ప్రకాశ్(అశోక్ సెల్వన్) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. మనోడికి కాస్త బిడియం, భయం. అడిషనల్ డీజీపై ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్‌లోని సీనియర్ ఆఫీసర్ లోకనాథ్(శరత్ కుమార్) దగ్గర ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా వీళ్లతో కలిసి పనిచేస్తుంది. తిరుచ్చిలో ఓ బాలిక హత్య కేసు వీళ్ల ముగ్గురు టేకప్ చేస్తారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే నగరంలో ఇదే రీతిలో జరుగుతున్న హత్యలు గురించి తెలుస్తుంది. ఇంతకీ వీళ్లని చంపుతన్నది ఎవరు? ప్రకాశ్-లోకనాథ్ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది మెయిన్ స్టోరీ. తమిళంలో సెన్సేషన్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో? The wait is over! The Thriller Sensation that Shattered Box Office Records, "Por Thozhil" is streaming on Sony LIV from Aug 11th.#PorThozhilOnSonyLIV #PorThozhil #SonyLIV @ApplauseSocial #E4Experiments @epriusstudio @nairsameer @SegalDeepak @e4echennai @cvsarathi pic.twitter.com/LOthMauGbD — Sony LIV (@SonyLIV) August 1, 2023 (ఇదీ చదవండి: సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!)