పియాజియో.. కొత్త వాణిజ్య వాహనం
‘పోర్టర్–700’ విడుదల ∙ధర రూ.3.18 లక్షలు
ముంబై: ఇటలీకి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘పియాజియో’ భారత విభాగమైన ‘పియాజియో వెహికల్స్’ తాజాగా కొత్త స్మాల్ కమర్షియల్ వెహికల్ (చిన్నతరహా వాణిజ్య వాహనం) ‘పోర్టర్–700’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.3.18 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ మహారాష్ట్ర) ఉంది. మెరుగైన ఇంధన సామర్థ్యంతో ఆధునిక టెక్నాలజీతో స్టైలిష్ డిజైన్‌తో ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చామని కంపెనీ పేర్కొంది.
పోర్టర్–700 వాహనంపై రెండేళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వరకు వారంటీ పొడిగింపు అందిస్తున్నామని తెలిపింది. ఫోర్–వీల్ కార్గో (సరుకు) మార్కెట్లో కార్యకలాపాల విస్తరణకు పోర్టర్–700 ఒక వ్యూహాత్మక అడుగని పియాజియో వెహికల్స్ చైర్మన్ రవి చోప్రా తెలిపారు. కాగా తేలికపాటి/చిన్నతరహా వాణిజ్య వాహన మార్కెట్లో పియాజియో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.