టీడీఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వన భోజనాలు
అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో వన భోజనాలు అట్టహాసంగా జరిగాయి. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్‌కి చాప్టర్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల నివాళులు అర్పించి పోర్ట్‌ల్యాండ్ ఒరెగాన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వనభోజనాలకు పోర్ట్‌ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఫన్ గేమ్స్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, బింగో, మ్యూజికల్ చైర్, బాల్ గేమ్‌లు నిర్వహించారు. మహిళలు, పిల్లలు, యువకులు, యువదంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్ అందరికీ శ్రీని కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలు అందజేశారు. ఫన్ గేమ్స్, ఆటల పోటీలు, రాఫెల్ డ్రాల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. శ్రీని అనుమాండ్ల కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో పాటూ, ఈ వేడుక విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేసిన టీడీఫ్ చార్టర్ టీం సభ్యులు కొండల్ రెడ్డి పుర్మ, రఘు స్యామ, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, నిరంజన్ కూర, కాంత్ కోడిదేటి, నరెందర్ చీటి, శివ ఆకుతోట, రాజ్ అందోల్, వీరేష్ బుక్క, జయాకర్ రెడ్డి ఆడ్ల, సందీప్ ఆశ, ప్రవీణ్ అన్నావఝల, భాను పోగుల, సురేష్ దొంతుల, అజయ్ అన్నమనేని, వెంకట్ ఇంజం, హరి సూదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పగిడి, సత్య సింహరాజ, కృష్ణారెడ్డి, కార్తీక్ రెడ్డి ఆశ, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.