poru
-
ప్రేమను బతికించుకునేందుకు ‘పోరు’
రాయవరం : స్నేహితుడి ప్రేమను బతికించడం కోసం స్నేహితులు చేసే పోరాటమే ‘పోరు’ చిత్రమని దర్శకుడు వైఎస్ఎస్ వర్మ, నిర్మాత మంతెన అచ్యుతరామరాజు తెలిపారు. రాయవరం మాజీ ఎంపీపీ కోట బాబూరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ‘పోరు’ చిత్రం వివరాలను వెల్లడించారు. గ్రామీణ వాతావరణంలో సాగే పూర్తి ప్రేమ కథాచిత్రమన్నారు. ఇప్పటికే సినిమా పాటలు మినహా 90శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. కాకినాడ, పిఠాపురం, సర్పవరం, ఉప్పాడ, రాచపల్లి గ్రామాల్లో సిని మా షూటింగ్ జరిగిందన్నారు. ఈ చిత్రంలో హీరోగా గోపి, హీరోయి¯ŒSగా అలేఖ్య, హీరో స్నేహితులుగా రోహిత్, సునీల్చరణ్లు నటిస్తున్నట్టు తెలిపారు. హీరో గోపి ఇప్పటికే ‘అమ్మాయిలంతే అదో టైపు’ సినిమాలో హీరోగా నటించారన్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకులుగా వ్యాస్, గోవింద్, కిష¯ŒSలు నటిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ జేఎ¯ŒSటీయూ అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ డి.కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా, కామెడీ క్యారెక్టర్లో మీసాల రామారావు నటిస్తున్నారన్నారు. సంగీతం వైవీ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ మోహ¯ŒSచంద్, చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రాడ్యూసర్గా బచ్చల రాజబాబు వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు వర్మ, నిర్మాత అచ్యుతరామరాజు తెలిపారు. చిత్ర యూనిట్‌ను చాణక్య నర్సింగ్‌హోమ్ అధినేత డాక్టర్ జీఎస్ఎ¯ŒSరెడ్డి, వైఎస్సార్సీపీ నేత ఆర్వీవీ సత్యనారాయణచౌదరి అభినందించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు పులగల శ్రీనివాసరెడ్డి, వెలగల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాచపల్లిలో ‘పోరు’ సినిమా షూటింగ్
రాచపల్లి (ప్రత్తిపాడు) : గ్రామంలో ‘పోరు’ సినిమా షూటింగ్‌తో శుక్రవారం సందడి నెలకొంది. వై.ఎస్.ఎస్.వర్మ దర్శకత్వంలో ‘అమ్మాయిలంతే..అదో టైపు’ ఫేం గోపీవర్మ, అలేఖ్య జంటగా నూతన తారాగణంతో నిర్మాత ఎం.ఎ.రామరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు బుద్దరాజు గోపీరాజు గృహం, రామాలయం, పోలవరం కాలువ వద్ద షూటింగ్నిర్వహించారు. గోపీరాజు గృహంలో తొలి రోజు హీరో హీరోయిన్ల చిన్ననాటి సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయి¯ŒS అలేఖ్య, హీరో తండ్రి పాత్రలో బత్తుల ప్రకాష్‌బాబు (పిఠాపురం జర్నలిస్టు), అతని కొడుకు, చిన్ననాటి హీరో పాత్రలో వైభవ్వర్మ, హీరోయి¯ŒS తల్లి పాత్రలో లక్ష్మి, తండ్రి పాత్రలో రాచపల్లి గ్రామానికి చెందిన వత్సవాయి అచ్యుత సుబ్బరాజు (హరీష్), హీరోయి¯ŒS చిన్ననాటి పాత్రలో లాస్యలపై రామాలయంలో పూజా కార్యక్రమాలను కెమెరామె¯ŒS మోహ¯ŒSచంద్ చిత్రీకరించారు. రోహిత్‌వర్మ, సునీల్ చరణ్, వ్యాస్, కాకినాడ జేఎ¯ŒSటీయూకే డైరెక్టర్ డాక్టర్ డి.కోటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రామ్‌కుమార్ కో– డైరెక్టర్. షూటింగ్ తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సందడి నెలకొంది. -
నిరుద్యోగులకు బాసటగా ‘ఉద్యోగపోరు’
9న కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ : నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న కలెక్టరేట్ ఎదుట నిరన కార్యక్రమం చేపట్టనున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానం మేరకు నెలకు రూ.2 వేల చొప్పున 32 నెలలకు ఒక్కో నిరుద్యోగికి రూ.64 వేల చొప్పున తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష వరకు బ్యాక్‌లాగ్‌పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ కావలసి ఉందన్నారు. వీటి నియామకంపై దృష్టి పెట్టకుండా కేవలం కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగ యువతనే కాక మహిళలు, రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్‌కు వారే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఉద్యోగపోరులో భాగంగా ఈ నెల 9న ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒరగబెట్టింది ఏమీలేదని విమర్శించారు. ఉద్యోగాలూ లేక, నిరుద్యోగ భృతి రాక యువత ఎంతో వేదనకు గురవుతోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందన్నారు. -
వైరా..పోరు
‘రెవెన్యూ డివిజన్’ కోసం బంద్ సంపూర్ణం వైరా: నియోజకవర్గ కేంద్రమైన వైరాను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. విద్యా, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు పలికాయి. నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వైరాను రెవెన్యూ డివిజన్‌గా కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రభుత్వం, అధికారులు స్పందించి ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరారు. ఇది సాకారమయ్యేందుకు పోరాడుతామని ప్రకటించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రాములు నాయక్, చింతినిప్పు మురళీధర్‌రావు, పసుపులేటి మోహన్‌రావు, తన్నీరు నాగేశ్వరరావు, యమాల గోపాలరావు, వంశీ, వనమా విశ్వేశ్వరావు, శీలం వెంకటనర్సిరెడ్డి, మచ్చా వెంకటేశ్వరరావు, చెరుకూరి కిరణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో ఘర్షణలు తలెత్తకుండా డీఎస్పీ ఎం శ్రీధర్‌రెడ్డి, సీఐ వి.చేరాలు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.