ప్రేమను బతికించుకునేందుకు ‘పోరు’
Published Tue, Jan 24 2017 10:18 PM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM
రాయవరం :
స్నేహితుడి ప్రేమను బతికించడం కోసం స్నేహితులు చేసే పోరాటమే ‘పోరు’ చిత్రమని దర్శకుడు వైఎస్‌ఎస్ వర్మ, నిర్మాత మంతెన అచ్యుతరామరాజు తెలిపారు. రాయవరం మాజీ ఎంపీపీ కోట బాబూరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ‘పోరు’ చిత్రం వివరాలను వెల్లడించారు. గ్రామీణ వాతావరణంలో సాగే పూర్తి ప్రేమ కథాచిత్రమన్నారు. ఇప్పటికే సినిమా పాటలు మినహా 90శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. కాకినాడ, పిఠాపురం, సర్పవరం, ఉప్పాడ, రాచపల్లి గ్రామాల్లో సిని మా షూటింగ్ జరిగిందన్నారు. ఈ చిత్రంలో హీరోగా గోపి, హీరోయి¯ŒSగా అలేఖ్య, హీరో స్నేహితులుగా రోహిత్, సునీల్‌చరణ్‌లు నటిస్తున్నట్టు తెలిపారు. హీరో గోపి ఇప్పటికే ‘అమ్మాయిలంతే అదో టైపు’ సినిమాలో హీరోగా నటించారన్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకులుగా వ్యాస్, గోవింద్, కిష¯ŒSలు నటిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ జేఎ¯ŒSటీయూ అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ డి.కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా, కామెడీ క్యారెక్టర్‌లో మీసాల రామారావు నటిస్తున్నారన్నారు. సంగీతం వైవీ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ మోహ¯ŒSచంద్, చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రాడ్యూసర్‌గా బచ్చల రాజబాబు వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు వర్మ, నిర్మాత అచ్యుతరామరాజు తెలిపారు. చిత్ర యూనిట్‌ను చాణక్య నర్సింగ్‌హోమ్ అధినేత డాక్టర్ జీఎస్‌ఎ¯ŒSరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి అభినందించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు పులగల శ్రీనివాసరెడ్డి, వెలగల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement