పోస్టల్ ఉద్యోగి ఇంట్లో బంగారం చోరీ
గుడివాడ : ఓ పోస్టల్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్టా జిల్లా గుడివాడ నీలామహల్ థియేటర్ రోడ్డులో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలు.. పోస్టల్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. భార్యాభర్యలను కట్టేసి వారి ఇంట్లో నుంచి 18 కాసుల బంగారంతో పాటు రూ.50 వేల నగదు చోరీచేసినట్లు పోలీసులకు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.