Post-production programs
-
పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోండి
అనూహ్యమైన పరిస్థితుల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. అయితే మే 4 నుంచి నిర్మాణానంతర కార్యక్రమాలు చేసుకోవచ్చని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు లేదా అంతకంటే తక్కువ మంది ఉండేట్టుగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో షూటింగ్ పూర్తయిన సినిమాల డబ్బింగ్, మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్ పనులను చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ జరిగే స్టూడియోలు బాగా శుభ్రంగా ఉండాలని, పని చేస్తున్న అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని పేర్కొన్నారు కేరళ మంత్రి ఎ.కె. బాలన్. సినిమా షూటింగ్స్‌కి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. -
వైవిధ్యమైన ప్రేమకథ
వరుణ్‌సందేశ్, పూర్ణ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వలా నేనిలా’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఇందూరి రాజశేఖర్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ -‘‘వరుణ్ సందేశ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కథ, కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలో పాటల్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. సోనియా బిర్జి, వెన్నెల కిషోర్, సన, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అమోఘ క్రియేషన్స్, మాటలు: ఉదయ్ భాగవతుల, కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: సాయికార్తిక్, కూర్పు: శ్రావణ్.