మీ జీమెయిల్ పాస్వర్డ్ సురక్షితమేనా?
* 50 లక్షల గూగుల్ పాస్వర్డ్లు లీక్
* ఆన్లైన్లో యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు
* వెంటనే పాస్వర్డ్ మార్చుకుంటే మేలు
గూగుల్ అకౌంట్స్‌కు చెందిన దాదాపు 50 లక్షల వరకు యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు లీకయ్యాయి. అవన్నీ ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోయాయి. మొత్తం 49.3 లక్షల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లతో కూడిన డేటా బేస్ రష్యాకు చెందిన బిట్‌కాయిన్ అనే సెక్యూరిటీ ఫోరంలో పోస్ట్ అయింది. మొత్తం ఉన్నవాటిలో 60 శాతం వరకు లాగిన్ వివరాలు లీకయ్యాయని, అవన్నీ ఇప్పుడు వాడుతున్నవేనని ఆ డేటాను పోస్ట్ చేసిన యూజర్ చెబుతున్నారు.
అయితే గూగుల్ మాత్రం తమ కంపెనీ నుంచి అంత సులువుగా వివరాలు లీకయ్యే అవకాశమే లేదని చెబుతోంది. అయితే.. ఇప్పటికీ తమ పాస్వర్డ్లు లీకైనట్లు అనుమానం ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలని, ఎందుకైనా మంచిది.. పాస్వర్డ్ మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.