సీఎం జోక్యంతో తగ్గిన బొజ్జల..!
పైచేయి సాధించిన ముద్దుకృష్ణమ
* డీఆర్వోగా విజయ్‌చందర్ ?
* ఎన్నికల కమిషన్ వద్దకు ఫైల్
* 18న ప్రత్యేక జీవో ద్వారా డీఆర్వోగా బాధ్యతలు..?
తిరుపతితుడా: జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో ) పోస్టింగ్ వ్యవహారం సీఎం చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అభ్యర్థన మేరకు డీఆర్వోగా జిల్లాకు చెందిన అధికారి విజయ్‌చందర్ పేరు ఖరారు చేశారు. అనంతరం సీఎం సింగపూర్ పర్యటనకు వెళ్లిన తరువాత మంత్రి బొజ్జల చక్రం తిప్పారు. మంత్రిగా తనకు తెలియకుండా డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఎలా ఖరారు చేస్తారని కన్నెర్ర చేశారు.
డెప్యూటీ సీఎం, రెవె న్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అండతో మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరో అధికారి పేరు తెరపైకి తెచ్చా రు. ఎం. వెంకటేశ్వరరావును డీఆవ్వోగా నియమించాలని రెవెన్యూ మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపాదనలు సిద ్ధం చేయించారు. ఈ వ్యవహారం మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మధ్య విభేదాలకు ఆజ్యం పోశాయి. విజయ్‌చందర్ జిల్లా వాసి కావడంతో టీడీపీ నేతలంగా మొగ్గుచూపారు.
మంత్రి బొజ్జల, మాజీ మంత్రి ముద్దుకృష్ణమ పట్టుదలకు పోవడంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. జరిగిన పరిణామాలు తెలుసుకున్న సీఎం ఒకింత సీరియస్‌గా తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తె లిసింది .దీనిపై బొజ్జలను మందలించినట్లు కూడా సమాచారం. డీఆర్వోగా విజయ్‌చందర్ నే నియమించాలని చెప్పడంతో మంత్రి బొజ్జల వెనక్కు తగ్గినట్టు తెలిసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో విజయచందర్ పోస్టింగ్ వ్యవహారానికి సబంధించిన ఫైల్ కమిషన్ వద్దకు చేరినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే రెండు,మూడు రోజుల్లో డీఆర్వో నియామకం ఖరారయ్యే పరిస్థితి ఉన్నట్లు సమాచారం.