తహశీల్దార్లకు పోస్టింగులు
కర్నూలు(కలెక్టరేట్): సాధారణ ఎన్నికలకు ముందు ఇతర జిల్లాలకు వెళ్లి తిరిగివచ్చిన తహశీల్దార్లకు కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం పోస్టింగులు ఇచ్చారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా నుంచి 43 మంది తహశీల్దార్లు ఏప్రిల్‌లో అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లారు. వెళ్లిన 43 తహశీల్దార్లలో 42 మంది తిరిగి వచ్చి ఈనెల 2న పోస్టింగ్ కోసం కలెక్టర్ దగ్గర రిపోర్టు చేసుకున్నారు. వీరికి మంగళవారం పోస్టింగులు ఇచ్చిన కలెక్టర్ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. 35 మందికి ఎన్నికల ముందు వరకు పనిచేసిన మండలాలకే తిరిగి తహశీల్దార్లుగా నియమించారు.
7 మందికి మాత్రం వివిధ కారణాల వల్ల పాత స్థానాలు కాకుండా కొత్త స్థానాలు కేటాయించారు. అంతేకాక జిల్లాలో పనిచేస్తున్న మరికొందరు తహశీల్దార్లను కూడా బదిలీ చేశారు. సి-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రమణరావును కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారిగా నియమించారు. ఇదివరకే రమణరావు పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్చార్జి ఏఓగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో డీటీలుగా పనిచేస్తూ పదోన్నతిపై ఇతర జిల్లాలకు వెళ్లి వచ్చిన ముగ్గురిని తహశీల్దార్లుగా పోస్టింగులు ఇచ్చారు.
పాత స్థానాల్లోకి వెళ్లింది వీరే...
ఇతర జిల్లాల నుంచి తిరిగి వచ్చిన తహశీల్దార్లలో చంద్రావతి, బాలగణేశయ్య, శివరాముడు, శివశంకర్‌నాయక్, ఎ.బి.ఎలిజబెత్, బి.పుల్లయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, తులసినాయక్, పి.రామకృష్ణుడు, నిత్యానందరాజు, అనురాధ, ఆర్.రాముడు, ప్రియదర్శిని, విజయుడు, మునికృష్ణయ్య, నాగేంద్రరావు, శివరామిరెడ్డి, వెంకట రమేష్‌బాబు, ఇంద్రాణి, మాలకొండయ్య, రామసుబ్బయ్య, వై.వెంకటేశ్వర్లు, పద్మావతి, జెడ్.ఎం.ప్రసన్నన్, సుధాకర్, ఆనంద్‌కుమార్, శేషఫణి, అన్వర్ హుసేన్, గోపాల్‌రావు, ఉమామహేశ్వరి, ఈరన్న, చంద్రశేఖర్, బి.శ్రీనివాసరావు, బి.రామకృష్ణ, టి.దాస్, జయప్రకాష్‌లకు ఎన్నికలకు ముందువరకు పనిచేసిన మండలాలకే నియమించారు.