poured petrol
-
చిట్టీ డబ్బులు అడిగినందుకు .. ఒంటిపై పెట్రోల్ పోసి..
నయీంనగర్: ‘చిట్టీ డబ్బులు ఎందుకు ఇవ్వరు’.. అని నిలదీసినందుకు చిట్‌ఫండ్ యాజమాన్యం మనుషులు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం గ్రేటర్ వరంగల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. హనుమకొండకు చెందిన పిట్టల రాజు(30) అచల చిట్‌ఫండ్ కంపెనీలో రూ.5 లక్షల చీటీ వేసి ఇటీవల పాడుకున్నాడు. అయితే యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా రాజును తిప్పించుకుంటోంది. ఈ క్రమంలో అతను గురువారం చిట్‌ఫండ్ కార్యాలయానికి వెళ్లి తన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో యాజమాన్యం.. రాజుపై దాడిచేసేందుకు తమ కంపెనీలోని ఏజెంట్ గణేశ్, అతని భార్య కావ్యలను పురమాయించింది. శుక్రవారం సాయంత్రం రాజు, అతని భార్య సిరి తమ సెల్‌ఫోన్ దుకాణంలో ఉండగా కావ్య, గణేశ్ బైక్‌పై వచ్చారు. బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రాజుపై కావ్య పోయగా గణేశ్ లైటర్‌తో నిప్పంటించాడు. మంటలు చుట్టుముట్టడంతో రాజు దుకాణంనుంచి బయటకు పరుగెత్తుకుని వచ్చాడు. మంటలను ఆర్పేందుకు సిరి ప్రయత్నిస్తుండగా గణేశ్, కావ్యలు మరోసారి రాజుపై పెట్రోల్ పోసి పరారయ్యారు. ఈ క్రమంలో సెల్‌షాపు ఎదురుగా ఉన్న పాన్‌షాప్ రంగయ్యకు కూడా మంటలు అంటుకుని గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణానికి పాల్పడ్డ కావ్య, గణేశ్‌లపై రాజు భార్య సిరి హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పెట్రోల్ పోసి ఒంటికి నిప్పు, ప్రేమ వ్యవహారమే కారణమా?
మద్దిపాడు(ప్రకాశం జిల్లా): ఓ యువకుడిపై కొందరు దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించారు. మద్దిపాడు మండలంలోని నేలటూరు ఎస్సీ కాలనీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన యరజాని అంకమ్మరావు(20) అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల వరకు కాలనీ సమీపంలో స్నేహితులతో గడిపి ఇంటికి వెళ్లాడు. అతడి వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి మేస్త్రీ పిలుస్తున్నాడంటూ కాలనీ బయటకు తీసుకువెళ్లారు. కాలనీ సమీపంలోని చప్టా వద్ద అతనితో మద్యం తాపించి, ఆ తర్వాత ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అక్కడ నుంచి అంకమ్మరావు కేకలు వేస్తూ చర్చి సమీపంలో పడిపోగా అతని సోదరుడు వచ్చి తన టీషర్ట్ విప్పి మంటలు ఆర్పివేశాడు. స్థానికులు స్పందించి 108లో రాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు రిమ్స్‌కు చేర్చారు. తనపై వెల్లంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు పెట్రోలు పోసి నిప్పంటించాడని, అతనితోపాటు మరో ఇద్దరు ఉన్నారని బాధిత యువకుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు, మద్దిపాడు ఎస్సై నాగరాజు తెలిపారు. బాలికతో ప్రేమ వ్యవహారమే కారణం? ఓ బాలికతో కలిసి ఉన్న ఫొటోలను అంకమ్మరావు తన స్నేహితులకు ఆదివారం రాత్రి వాట్సప్‌లో పంపినట్లు సమాచారం. ఆ బాలిక తనకు దక్కదనే ఆలోచనతో అంకమ్మరావు ఈ పని చేసి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. కాగా అంకమ్మరావు శరీరం 70 శాతం మేర కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. చదవండి: యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్ రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
రెండేళ్ల బాలుడిపై పెట్రోలు పోసి..
-
బైక్‌కు అడ్డం వచ్చాడని...
-
బైక్ కుఅడ్డం వచ్చాడని...
హైదరాబాద్: అభంశుభం తెలియని రెండేళ్ల బాలుడు బైక్‌కు అడ్డం వచ్చాడని అతికిరాతంగా పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు. అమానవీయ ఘటన పాతబస్తీ కాలాపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బిలాల్ నగర్ కు చెందిన ఫైజర్ ఖాన్ బైక్ రైడింగ్ చేస్తుండగా ఇద్దరు చిన్నారులు అడ్డుగా వచ్చారు. దీంతో ఆగ్రహంతో తన వద్ద బాటిల్ లో ఉన్న పెట్రోల్ ను ఒక బాలునిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలున్ని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు.