విద్యుత్ జగడం అవసరమా?
విద్యుత్ సంక్షోభంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, ఉపయోగిస్తున్న పద ప్రయోగాలు చూస్తుంటే పోట్లాడుకోవడమే తరువాయి అన్న ట్లుంది. వీరి మాటలు ఉన్న సమస్యను మరింత జటిలం చేయ డమే కాకుండా ఇరుప్రాంతాల ప్రజల్లో ద్వేషం పెంచేలా ఉన్నా యి. మరీ ముఖ్యంగా తెలంగాణలో రైతుల పరిస్థితి భయా నకంగా ఉంది. అన్నదాతల ఆత్మహత్యల గురించి వినని రోజు లేదు. చూపించని పత్రికా లేదు. విషాదకరమైన విషయం ఏమిటంటే అన్నదాతలకు రాజకీయాలు లేవు. తెలియవు కూడా. పంట చేతికి రాక, అప్పులు కొండలా కనబడుతున్న నేపథ్యంలో గుండె చెదిరి శాశ్వతంగా బతుకునుంచి వైదొలగుతున్న వారి విషయంలో కూడా రాజకీయాలు చేయవలసిందేనా? ఏ ప్రాంతా నికైనా విద్యుత్‌తో పాటు సాగునీరు, తాగునీరు అవసరమే.
కానీ డజన్ల సంఖ్యలో కళ్లముందు రైతులు నేలరాలిపోతుంటే కాసింత సానుభూతి, తక్షణ స్పందన కూడా ముఖ్యమంత్రులలో లోపిం చడం అమానుషం. మీరెన్ని రాజకీయాలయినా ఆడండి కానీ దయచేసి అన్నం పెట్టే రైతు కుటుంబాలను అడుక్కుతినే వైపు నకు నెట్టకండి.
ఎ.గౌతం హైదరాబాద్