పవర్‌గ్రిడ్ కబడ్డీ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: సదరన్ రీజియన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్ రీజియన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు రీజియన్లకు చెందిన ఉద్యోగులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నారు. దాదాపు 120 మంది వివిధ జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సదరన్ రీజియన్ (సికింద్రాబాద్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి. శేఖర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.