ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 2017-18 ఏడాదికిగానూ 3.6 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా ఛార్జీల పెంపు నుంచి వ్యవసాయ విద్యుత్‌కు మినహాయింపు లభించగా, అలాగే గృహ వినియోగదారులకు 1-200 యూనిట్ల వరకూ ఎలాంటి పెంపు లేదు. 200 యూనిట్లు నుంచి 500 వందల యూనిట్ల వరకూ 3శాతం పెంచింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో రూ.800 కోట్లు భారం పడనుంది.