Powerful dialogue
-
లౌక్యం హల్చల్
* స్వింగ్‌లో ఉండగా రింగ్ లోకి వస్తే బాడీలు బౌన్స్ అవుతాయ్ * ఊర్వశి కాంప్లెక్స్‌లో లౌక్యం హీరో గోపీచంద్ రాజమండ్రి సిటీ : ‘స్వింగ్‌లో ఉండగా రింగ్‌లోకి వస్తే బాడీలు బౌన్స్ అవుతాయ్ ’ అంటూ హీరో గోపీచంద్ ‘లౌక్యం’ చిత్రంలోని పవర్ఫుల్ డైలాగ్ చెప్పి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘లౌక్యం’ ప్రదర్శిస్తున్న రాజమండ్రి ఊర్వశి కాంప్లెక్స్‌లో హీరో గోపీచంద్, దర్శకుడు వాసు సహచర నటులతో వచ్చి మ్యాట్నీ ప్రదర్శన జరుగుతుండగా ప్రేక్షకుల్ని పలకరించారు. తన చిత్రానికి ఇంతబాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు బాణ సంచా కాల్చి గోపీచంద్ థియేటర్లో అడుగు పెట్టే వరకూ పూలవర్షం కురిపించారు. జిల్లాకు చెందిన సినిమా డెరైక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ గోపీచంద్ విజయపరంపర మెదలైందని అతనితో భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు తీస్తానని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు గోపీచంద్‌ను గజమాలతో సత్కరించారు. చిత్రం యూనిట్ సభ్యులు విలన్ సంపత్‌రాజ్, హాస్యనటుడు పృధ్వీరాజ్, కథా రచయిత కోన వెంకట్, నిర్మాత ఆనంద్‌ప్రసాద్, కెమెరామెన్ వెట్రి తదితరులు పాల్గొన్నారు. -
పవర్ఫుల్ లెజెండ్
‘రేయ్... నీకు కావాల్సింది నేను. నాతో పెట్టుకో. పదిమందితో రా. పదికి పది పెంచుకుంటూ రా. పదిసార్లు రా...’ ‘సింహా’ సినిమాలో... అండర్ ప్లే చేస్తూ, బేస్ వాయిస్‌తో బాలయ్య ఈ డైలాగ్ చెబుతుంటే... థియేటర్లు విజిల్స్‌తో మోతెక్కిపోయాయి. అభిమానులైతే ఉత్సవమే చేసుకున్నారు. ఓ విధంగా ఆ సినిమాతో నందమూరి అభిమానుల ఆకలిని తీర్చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. దాదాపు ఆరేడేళ్ల విరామం తర్వాత బాలయ్యకు వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘సింహా’. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం బాలయ్యకు రాలేదు. ఇది అభిమానులకు బాధ కలిగిస్తున్న అంశం. అందుకే.. మళ్లీ వారి మనసుల్లో ఆనందాన్ని నింపే పనిలో ఉన్నారు బోయపాటి. ‘సింహా’ను తలదన్నే పవర్ఫుల్ విజయం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారాయన. ఆ శ్రమకు ప్రతిరూపంగా ‘లెజెండ్’ తయారవుతోంది. ఫార్చునర్ కారు పక్కన కోర మీసం తిప్పి సింహంలా నిలబడ్డ బాలయ్య స్టిల్‌ను అభిమానుల కోసం కొత్త సంవత్సరం కానుకగా... నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర విడుదల చేశారు. ఇప్పటికి 80 శాతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫారిన్లో పాటలను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఫిబ్రవరిలో విడుదల చేసి, మార్చి నెలాఖరున సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.