
లౌక్యం హల్‌చల్
* స్వింగ్‌లో ఉండగా రింగ్ లోకి వస్తే బాడీలు బౌన్స్ అవుతాయ్
* ఊర్వశి కాంప్లెక్స్‌లో లౌక్యం హీరో గోపీచంద్
రాజమండ్రి సిటీ : ‘స్వింగ్‌లో ఉండగా రింగ్‌లోకి వస్తే బాడీలు బౌన్స్ అవుతాయ్ ’ అంటూ హీరో గోపీచంద్ ‘లౌక్యం’ చిత్రంలోని పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘లౌక్యం’ ప్రదర్శిస్తున్న రాజమండ్రి ఊర్వశి కాంప్లెక్స్‌లో హీరో గోపీచంద్, దర్శకుడు వాసు సహచర నటులతో వచ్చి మ్యాట్నీ ప్రదర్శన జరుగుతుండగా ప్రేక్షకుల్ని పలకరించారు. తన చిత్రానికి ఇంతబాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు బాణ సంచా కాల్చి గోపీచంద్ థియేటర్‌లో అడుగు పెట్టే వరకూ పూలవర్షం కురిపించారు.
జిల్లాకు చెందిన సినిమా డెరైక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ గోపీచంద్ విజయపరంపర మెదలైందని అతనితో భవిష్యత్ లో మరిన్ని మంచి చిత్రాలు తీస్తానని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు గోపీచంద్‌ను గజమాలతో సత్కరించారు. చిత్రం యూనిట్ సభ్యులు విలన్ సంపత్‌రాజ్, హాస్యనటుడు పృధ్వీరాజ్, కథా రచయిత కోన వెంకట్, నిర్మాత ఆనంద్‌ప్రసాద్, కెమెరామెన్ వెట్రి తదితరులు పాల్గొన్నారు.