పేరు మారుస్తారా.... ఫిర్యాదు చేస్తాం
శ్రీకాకుళం: తమ శాఖలో ఖాళీలను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానం ద్వారా యుద్దప్రాతిపదికన భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పి.పుల్లారావు వెల్లడించారు. శనివారం శ్రీకాకుళం పర్యటనలో భాగంగా విలేకర్లతో మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును తెలంగాణ ప్రభుత్వం మార్చడంపై పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్రానికి, గవర్నర్కు తమ ప్రభుత్వం ఫిర్యాదు చేయనుందని తెలిపారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పేరు మార్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని పుల్లారావు గుర్తు చేశారు. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొ.కె.జయశంకర్ జయంతి సందర్బంగా... ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.