ప్రభాత్ డైరీ ఐపీఓ ప్రైస్‌బాండ్ తగ్గింపు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నుంచి తగిన స్పందన లేకపోవడంతో ప్రభాత్ డైరీ సంస్థ తన ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను తగ్గించింది. అంతేకాకుండా ఐపీఓను మరో మూడు రోజులు పొడిగించింది. ప్రైస్‌బాండ్‌ను రూ.140-147 నుంచి రూ.115-126కు తగ్గించామని, రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌కు రూ.5 డిస్కౌంట్ ఇస్తామని కంపెనీ తెలిపింది. గత నెల 28న ప్రారంభమైన ఈ ఐపీఓ మంగళవారంతో ముగియాల్సి ఉంది. దీనిని ఈ నెల 4 వరకూ కంపెనీ పొడిగించింది. ఈ ఐపీఓ 28 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది.