కాంగ్రెస్ నేత సోదరుడిని కత్తులతో పొడిచి..
సూరత్: గుజరాత్లో దారుణం జరిగింది. సూరత్‌లో ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన చుట్టుపక్కలవారిని భయబ్రాంతులను చేసింది. హత్యకు గురైన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత తమ్ముడు కూడా ఉన్నాడు.
శనివారం రాత్రి అశ్వినికుమార్ రోడ్డు ప్రాంతంలో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నేతగా సాగుతున్న ప్రఫుల్ తొగాడియా సోదరుడు భరత్ తొగాడియా.. బాలు హిరానీ, అశోక్ పటేల్ అనే మరో ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో వారిపై ఒకేసారి దాడి చేశారు. ఈ ఘటనలో ఈ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దినేష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. నేరస్తుల పట్టుకునేందుకు పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు. భరత్ తొగాడియా విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాకు చాలా దగ్గరి బంధువు కూడా.