ప్రగతి విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్
సాక్షి, అవనిగడ్డ : డీఎస్సీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ వందల కోట్లు గడించిన ప్రగతి విద్యాసంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు బుధవారం దాడి చేశారు. ప్రగతి విద్యాసంస్థల యజమాని పూర్ణచంద్రరావు ఆస్తులను తనిఖీ చేస్తున్నారు. ప్రగతి విద్యాసంస్ధలకు అవనిగడ్డ, రేపల్లె, తెనాలి, కంకిపాడుల్లో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.
పామర్రు సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో కోచింగ్ సెంటర్ను నిర్మిస్తున్నట్లు, మచిలీపట్నంలో వందల ఎకరాల భూములు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కాగా, ప్రగతి విద్యాసంస్థల్లో ప్రతి ఏటా 20 వేల మంది డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు.
డీఎస్సీ కోచింగ్కు ఒక్కరికి గానూ రూ. 25 వేల ఫీజును ప్రగతి విద్యాసంస్థ వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు.