Praja Sankalpa Padayatra
-
పాదయాత్ర స్ఫూర్తితో పాలన
సాక్షి, అమరావతి: ‘‘నా 3,648 కి.మీ. ప్రజాసంకల్ప పాదయాత్రలో కళ్లారా చూసిన సమస్యలకు పరిష్కారం వెతుకుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చా. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకూ ప్రతి అడుగులో కూడా నేను చూసిన ఆ సమస్యలను పరిష్కరిస్తూ 58 నెలల పాలన సాగింది’’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ‘మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథమో, దానికి ప్రాధాన్యత ఎప్పుడు వచ్చిందంటే ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా.గతంలో మేనిఫెస్టో అని అందరూ చెప్పేవాళ్లు. ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ చూపించేవాళ్లు. ఎన్నికలు ముగిశాక ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో గాలిస్తే ఎవరికీ కానరాని పరిస్థితి. ఎన్నికల తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్ చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వాన్నమైన పరిస్థితిని మనమంతా చూశాం’ అని గుర్తు చేశారు. మేనిఫెస్టో 2024ను విడుదల చేస్తూ ఇంకా ఏమన్నారంటే..ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మేనిఫెస్టో..మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోను బైబిల్‌గా, ఖురాన్, భగవద్గీతలా భావిస్తూ హామీలను 58 నెలలుగా అమలు చేసిన విధానం దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది 2019 నాటి మన మేనిఫెస్టో (అప్పటి మేనిఫెస్టోను చూపిస్తూ). అప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎంతో నిష్టగా అమలు చేశాం. వాటిని ఏ స్థాయిలో అమలు చేశామంటే మేనిఫెస్టో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ముఖ్యమైన అధికారి దగ్గర ఉంది. మన మేనిఫెస్టో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉంది. అక్క చెల్లెమ్మలూ ఇదిగో మా మేనిఫెస్టో. చెప్పినవన్నీ నెరవేర్చామో లేదో మీరే టిక్ చేయాలని కోరాం. మొట్టమొదటి సంవత్సరంలో 85 – 88 శాతం టిక్ చేస్తే చివరి ఏడాది నాటికల్లా 99 శాతం పైచిలుకు మేనిఫెస్టో హామీలను అమలు చేసి ప్రజల వద్దకు వెళ్లాం. నవరత్నాల పాలన...నవరత్నాల పాలనకు అర్థం చెబుతూ 58 నెలల కాలంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్లాయి. ఇదిఒక చరిత్ర. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగినవాడిగా వారి ఇంటికే పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితి కూడా 58 నెలల కాలంలోనే చూశారు. 2019లో మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు మనవాళ్లే చాలామంది సాధ్యమేనా? అని నాతో అన్నారు. ఈ మాదిరిగా స్కీమ్‌లు, బటన్ నొక్కడం, ముందుగానే క్యాలెండర్లో ఈ నెలలో ఏ పథకం అందుతుందో ప్రకటించి సరిగ్గా అదే సమయానికి అందించడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. 2014లో బాబు మోసపూరిత హామీలు..2014లో చంద్రబాబు ఎన్నో మోసపూరిత హామీలిస్తున్నారు. మరి మనం కూడా ఇవ్వకపోతే ఎలా? తరువాత సంగతి తరువాత చూసుకుందాం.. ముందైతే హామీలు ఇచ్చేద్దామని నా శ్రేయోభిలాషులే సలహాలు ఇచ్చారు. కానీ ఆ రోజు నేను అలా చేయలేదు. ఆరోజు కూడా చేయగలిగేవి మాత్రమే చెప్పా. అబద్ధాల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా. కానీ ఈరోజు గర్వపడుతున్నా. నాకు 2014లో అధికారం రాలేకపోయినప్పటికీ చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగేవి మాత్రమే చెప్పి, చేసి చూపించి, మళ్లీ ప్రజల దగ్గరికి ఈరోజు ఒక హీరోలా వెళుతున్నా. ఆ ప్రభుత్వానికి – ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. సాకులు చూపకుండా.. ప్రజలకు అండగాఈరోజు పేదవాళ్ల పరిస్థితి ఏమిటి? ఎలా ఉన్నారు? ఎలా బతుకుతున్నారంటే అద్భుతంగా ఉన్నారు. పాదయాత్ర సమయంలో పేదవాళ్ల పరిస్థితి ఏమిటని గమనిస్తే ... చదివించాలని ఆరాటం ఉన్నా పిల్లలను చదివించలేని పరిస్థితి. తల్లితండ్రులు ఫీజులు కట్టలేక పోవడంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులను కళ్లారా చూశా. అవ్వాతాతలకు అన్ని అర్హతలు ఉన్నా నాడు పెన్షన్ రాని పరిస్థితి. ఇళ్లు ఇవ్వని పరిస్థితి. రేషన్ కావాలన్నా, మరుగుదొడ్లు కావాలన్నా, సబ్సిడీ మీద లోన్లు రావాలన్నా, ఇచ్చే అరకొర వాటికి కూడా లంచాలు, వివక్ష. రాజకీయ నాయకులు, పార్టీలు సృష్టించిన సమస్యలు, వ్యవస్థల వల్ల పేదవాడి బతుకు ఎలా అతలాకుతలం అయిందో నా కళ్లారా చూశా. 2019లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఈరోజు వరకు ప్రతి అడుగు కూడా నేను చూసిన ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ, మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరించేలా 58 నెలల పాలన సాగింది. కోవిడ్ వల్ల రెండేళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయినా, ఆదాయాలు రాకపోయినా, ఖర్చులు పెరిగినా మేం సాకులు చూపలేదు. మేనిఫెస్టో అమలు చేయకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కోలేదు. ఎన్ని సమస్యలున్నా, ఎక్కడా సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా, అండగా ఉన్నాం. దేశ చరిత్రలో తొలిసారిగా..ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేగంగా అడుగులు వేస్తూ ఆగస్టులో వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. అక్టోబర్ రెండో తారీఖు కల్లా సచివాలయ వ్యవస్థను తెచ్చాం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని అమలు చేశాం. ఎవరైనా పొరపాటున మిస్ అయితే వారిని జల్లెడ పట్టి వెతికి మరీ మరో అవకాశం కల్పించాం. మొట్టమొదటి సారిగా ఏటా ప్రజల వద్దకు మేనిఫెస్టోను పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలు గడప గడపకూ వచ్చి నేరుగా ప్రజలను కలుసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకోవడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. -

పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు
-
వైఎస్ జగన్ పాదయాత్ర సంకల్పానికి ఆరేళ్లు
-
విజయసంకల్పానికి నాలుగేళ్లు
-
ప్రజా సంకల్ప యాత్ర చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగించిన ప్రజా సంకల్ప పాదయాత్ర కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పాదయాత్ర పూర్తయ్యి నేటికి మూడేళ్లవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించారని చెప్పారు. పాదయాత్ర ఆద్యంతం ప్రజల గుండెల్ని హత్తుకుందన్నారు. పాదయాత్రలో మూడు సంవత్సరాల క్యాలెండర్లు మారాయని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాల ద్వారా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ అందిస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి డాక్టర్ వైఎస్సార్‌లా పేదవాడి గుండెల్లో బతకాలన్న కసే వైఎస్ జగన్‌ను ముందుకు నడిపిస్తోందని తెలిపారు. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఎలా ఉంటాడో, వైఎస్ జగన్‌ను చూసి నేర్చుకుంటాయని చెప్పారు. ప్రతిదీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని కొప్పరపాలెంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోలు పోసి, నిప్పంటించిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని అప్పిరెడ్డి కోరారు. మొన్న పల్నాడులో ఒక తాగుబోతు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు.. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం పట్ల జరిగిన దుశ్చర్యను ఎందుకు ఖండించలేక పోతున్నారని ప్రశ్నించారు. విగ్రహాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం టీడీపీకి మొదటి నుంచీ అలవాటేనని ఆయన « ద్వజమెత్తారు. -
వైఎస్ జగన్‌కు రాపాక శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి నేటికి (శుక్రవారం) మూడు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాసంకల్ప యాత్రం ఓ చరిత్రను లిఖించిందని అన్నారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఆయన వెంట వైఎస్సార్సీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఆయనకు మద్దతుగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. 17 నెలల పాలనలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని, బ్యాంకుల ద్వారా ప్రత్యేక మైన నిధులు మంజూరు చేసి ఏప్రిల్ నాటికి బాగుచేస్తానని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు ‘గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రోడ్లు కూడా వేసిన పరిస్థితి లేదు. అటువంటి రోడ్లను కూడా బాగు చెయ్యటానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉంది. పాదయాత్ర ఇచ్చిన హమీ మేరకు 56బీసీ కులాలకు కార్పొరేషన్లు ఎర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఎవరు చేయని సాహసం సీఎం జగన్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో కరోనా పేరుతో ఎన్నికలను నిలుపుదల చేశారు. వాస్తవానికి అప్పుడు కరోనా కేసులు అంతగా లేవు. ఇప్పుడు వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యహారం పై ప్రజల నుండి పూర్తి వ్యతికత ఉంటుంది. స్దానిక సంస్థలు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పరిస్థితి లేదు’ అని అన్నారు. -
ఆదుకోవాల్సిన యజమాన్యం తప్పించుకుందన్న
-
ఆడపిల్లల కష్టాలు, భద్రతపై వైఎస్ జగన్‌కు లేఖ రాసిన వేణుక
-
335వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం : ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 335వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పలాస నియోజకవర్గం, వంకులూరు క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చిన్న వంకులూరు, అనకాపల్లి క్రాస్, రంగోయి క్రాస్, రాంనగర్, బహడపల్లి, నల్లబొడ్లూరు, గుజ్జులురు, బి జగన్నాథపురం మీదుగా నారయణపురం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
334వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
శవాలమీద పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు : వైఎస్ జగన్
-
‘శవాలమీద పేలాలు ఏరుకునే రకం చంద్రబాబు’
సాక్షి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తుపాను కారణంగా రూ.3450కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాసి, కేవలం 500 కోట్లు మాత్రమే బాధితులకు చెల్లించారని జగన్ వెల్లడించారు. తుపాను కారణంగా నష్టపోయిన పోయిన వారికి చంద్రబాబు చెక్కులు ఇచ్చారుకానీ ఆ చెక్కుల్లో డబ్బులు మాత్రం ఇంతవరకు వెయ్యలేదని విమర్శించారు. బాధితులకు వచ్చే నష్టపరిహారం కూడా దోచుకుంటున్నారని, శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా చంద్రబాబు తీరు ఉందని జగన్ వ్యాఖ్యానించారు. తుపానులో సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రజాసంకల్పయాత్ర 333వ రోజు పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ‘‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులను ఆదుకుంటాం. తుపానులో కొబ్బరిచెట్లు కోల్పోయిన రైతుకు ప్రతీ చెట్టుకు 3000 చొప్పున చెల్లిస్తాం. ఇళ్లు కోల్పోయినవారికి కొత్త ఇళ్లు కట్టిస్తాం. పలాస జీడిపప్పుకు ఎంతో ప్రసిద్ధిచెందినది. కానీ టీడీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ట్యాక్స్ ఫేమస్‌గా తయారైంది. పలాస ఎమ్మెల్యే అల్లుడి గిల్లుడును తట్టుకోలేకపోతున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. ఆయన పేరు వెంకన్న చౌదరి. ఇక్కడ ఏం చేయాలన్నా ఆయనకు ట్యాక్స్ కట్టి చేయాలి. ఇక్కడి ప్రజల ఎక్కువగా జీడిపప్పు పంటపై ఆధారపడి ఉన్నారు. వాటిపై కూడా జీఎస్టీ పేరుతో దోపిడీ చేస్తున్నారు’’ అని అన్నారు. ‘‘బయట మార్కెట్లో కేజీ జీడిపప్పు 600కు తక్కువగా ఉంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో మాత్రం 1100 ఉంటుంది. దళారీ వ్యవస్థను అడ్డుకోవాల్సిన సీఎంయే పెద్ద దళారీగా తయారైయ్యారు. ఈప్రాంతంలో వైఎస్సార్ హయాంలో 35వేలకు పైగా ఇళ్లను నిర్మించారు. కానీ నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్కటైనా కట్టించారా. పలాస, ఇచ్చాపురం, టెక్కలి ప్రాతంలో కిడ్నీ బాధితులు ఉన్నారు. వారికోసం గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలుచేయలేదు. డయాలసిస్ సెంటర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో పునాదిరాయి కూడా పడలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్‌ను, కిడ్నీ రిసెర్చ్ హాస్పిటల్‌ను రెండువందల పడకల గదులతో ఏర్పాటు చేస్తాం. చంద్రబాబుకు తోడు పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కూడా కిడ్నీ బాధితుల కోసం ఇక్కడికి వస్తాడు. కానీ చేసేందేమీ లేదు. బాబుకు కష్టం వచ్చినపుడల్లా ఆయన పార్టనర్ వస్తాడు’’ అని జగన్ విమర్శించారు. కేసీఆర్ ప్రకటన ఆహ్వానించాలి.. ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రం అయినప్పటికీ ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా అన్నారు. ఆయన ప్రకటనను ఆహ్వానించాల్సింది పోయి దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మనకున్న ఎంపీలకు తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా తోడైతే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురాచ్చు’’ అని పేర్కొన్నారు. -
వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు నేను తోడుగా ఉంటాను..
-
325వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 325వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు బుధవారం ఉదయం కొబ్బరిచెట్లపేట నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జార్జంగి, కొత్తపేట, కోటబొమ్మళి, సీతన్నపేట మీదుగా దుర్గమ్మపేట వరకు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర : రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 324వ రోజు ప్రజాసంకల్పయాత్ర మంగళవారం కొబ్బరిచెట్లపేట వద్ద ముగిసింది. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం లింగాల వలస నుంచి పాదయాత్రను ప్రారంభిచారు. అఅక్కడి నుంచి చల్లవానిపేట, సౌదాం, రేగులపాడు క్రాస్, కొప్పాలపేట క్రాస్, దుప్పాలపాడు క్రాస్, గంగుపేట, కస్తురిపాడు జంక్షన్ మీదుగా కొబ్బరిచెట్ల పేట వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. -
321వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 321వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు శనివారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని అలికమ్ క్రాస్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నైరా, కరిమిల్లిపేట క్రాస్, రోణంకి క్రాస్, భైరి జంక్షన్, కరజడ మీదుగా నర్సన్నపేట నియోజక వర్గంలోకి ప్రవేశించి మడపం, దేవాడి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
287వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. మంగళవారం ఉదయం జననేత 287వ రోజు పాదయాత్రను బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్ నుంచి ప్రారంభించారు.అక్కడి నుంచి బాడంగి, ముగద, చిన్న భీమవరం క్రాస్, పెద్ద భీమవరం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. జననేత వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. -
ట్రిపుల్ ఐటీలో సీటు ఇవ్వలేదన్నా..
‘అన్నా.. నాకు పదో తరగతిలో 9.5 గ్రేడ్ వచ్చింది. ట్రిపుల్ ఐటీలో సీటు ఇవ్వలేదు’ అని మామిడివానిపాలేనికి చెందిన పీలా ఐశ్వర్య పాదయాత్రలో జననేత జగన్‌ను కలసి కన్నీటి పర్యంతమైంది. ‘రెండు సార్లు కౌన్సెలింగ్‌కు రమ్మన్నారు. రెండో సారి వెళ్లాక కౌన్సెలింగ్ రద్దయింది అని చెప్పి వెనక్కి పంపించేశారు. రాజకీయ పైరవీలు చేసిన వారికే సీట్లు ఇస్తున్నారన్నా. మాలాంటి పేదవాళ్లను పట్టించుకోవడం లేదు. నువ్వు సీఎం అయితేనే మాలాంటి వాళ్లు ఇంజినీరింగ్ విద్యనభ్యసించే అవకాశం ఉంటుందన్నా’అని వాపోయింది. -
పంట పూర్తిగా దెబ్బతిందయ్యా
అధిక పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట మొత్తం దెబ్బతిందయ్యా అంటూ కాట్రావులపల్లికి చెందిన మొక్కజొన్న రైతు శివుడు గణేశ్వరరావు వాపోయారు. పాదయాత్రలో సీతానగరం జంక్షన్ వద్ద జగన్‌ను కలిసి తన గోడు వినిపించాడు. అదిగోనయ్యా దెబ్బతిన్న పంట అంటూ తన చేనును జగన్‌కు చూపించాడు రైతు గణేశ్వరరావు. రైతు విజ్ఞప్తి మేరకు జగన్ చేనువైపు చూసి దెబ్బతినడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అకాలంగా కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్నదని, ఎకరాకు రూ.30 వేలు నష్టం వాటిల్లిందంటూ రైతు గణేశ్వరరావు జగన్ ఎదుట వాపోయారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వేద పండితులు