మళ్లీ శిక్ష విధించుకున్న హరిబాబు
అద్దంకి: ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మరోసారి తనను తాను శిక్షించుకున్నారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం జడ్పీ హై స్కూల్లో హరిబాబు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో 15 మంది టీచర్లకు గాను 5 మంది మాత్రమే హాజరయ్యారు. సమయానికి టీచర్లు రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ల గైర్హాజరుకు నైతిక బాధ్యత వహిస్తూ పది నిమిషాలు ఎండలో నిలబడి తనకు తాను శిక్షను విధించుకున్నారు.
కాగా గతంలో కూడా హరిబాబు ప్రభుత్వ వాహనాన్ని తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారని జడ్పీ సభ్యులు ఆరోపించడంతో స్పందించిన ఆయన ఎండలో నిలబడి శిక్ష విధించుకున్నారు. ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా తాను తప్పు చేశానని చెబుతూ, అందుకే తనకు తాను శిక్ష వేసుకుంటున్నట్టు అప్పట్లో తెలిపారు.