Prakasam district tour
-
‘ఓపెన్’కు ఇదొక ఆరంభం మాత్రమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు పరి శీలించడానికి ఫిబ్రవరి 20న శివరాత్రికి ముందురోజు నల్లమల అడవుల ముఖ ద్వారం డోర్నాల వద్దకు వెళ్లారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాదవశాత్తు నల్లమల అడవుల్లో మరణించిన కర్నూలు జిల్లా వెలిగోడు మండలంలోని రుద్రకొండ వద్ద ఉన్న పావురాలగుట్టకు ఈ వెలిగొండ ప్రాజెక్టు సమీప ప్రాంతం. అయితే, సీఎంగా వైఎస్సార్ జీవించివున్న రోజుల్లో నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలకు సిద్ధం అన్నప్పుడు, ‘మీడియా’ సాక్షిగా వాళ్ళు అడివిలో నుండి బయటకు వచ్చిందీ, చర్చలు ముగిసాక వాళ్ళు తిరిగి ‘లోపలికి’ వెళ్ళిందీ ఆ ప్రాంతంలోనే. మా ప్రభుత్వం మీతో మాట్లాడుతుంది అని నక్సలైట్లను ఆహ్వానించిందీ, ఆ ప్రాంతాన్ని ప్రధాన స్రవంతితో కలపడానికి వెలుగొండ ప్రాజెక్టుకు ఆయన శంకు స్థాపన చేసిందీ; ఇవి రెండూ జరిగింది, 2004లో వైఎస్సార్ సీఎం అయిన తొలి ఆరు నెలల్లోనే. నిజానికి ఈ ప్రాజెక్టును 1996 మార్చి 5 న అప్పటి సీఎం చంద్రబాబు తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చెయ్యాలని అప్పట్లో లక్ష్యం పెట్టారు, కాని 2000 మే చివరి వరకు కనీసం అనుమతులు కూడా రాలేదు. తర్వాత 2004 ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. వైఎస్సార్ సీఎం అయ్యాక, 2004 అక్టోబర్ 27న నల్లమల ముఖద్వారం గొట్టిపడియ దగ్గర దీనికి శంకుస్థాపన చేసి, వెంటనే నిధులు విడుదల చేశారు. అప్పటికి 1996లో రూ. 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి రూ. 5,500 కోట్లకు చేరింది. కానీ, వైఎస్సార్ చొరవతో 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80% పూర్తి అయ్యాయి. మూడు ఆనకట్టలు పూర్తి చేశారు. కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు ఇంకా పూర్తి కాలేదు. తండ్రి ఆనాడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు వద్ద, ఇప్పుడు తనయుడు సీఎం హోదాలో ప్రాజెక్టు సొరంగం ‘లోపలికి’ వెళ్ళడం అనేది, దృశ్యమానంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉండవచ్చు. కానీ చూడ్డానికి అక్కడ అంతకు మించి ఇంకా ఎంతో వుంది. ఇప్పటివరకు రాజ్యం ‘లోపలికి’ వెళ్ళక, ‘ఓపెన్’ కాని చాలా కొత్త ప్రాంతాలను, ఈ ప్రభుత్వం విద్య, వైద్యంతో పేదలకు గౌరవ ప్రదమైన జీవనం ఇస్తూ, చేస్తున్న ‘ఓపెన్’కు ఇదొక ఆరంభం మాత్రమే. (చదవండి: వెలిగొండ వేగం పెరగాలి) మధ్య కోస్తాలో తూర్పుకనుమల పాదాల వద్ద నల్లమల అడవుల అంచుల్లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు, జిల్లాల్లోని కరువు ప్రాంతాల్ని కలుపుకుని, 1970లో ‘ప్రకాశం’ ఒక జిల్లా అయింది. జిల్లా పశ్చిమ ప్రాంతం పెద్దగా మెరుగుపడిన పరిస్థితి అయితే ఇప్పటికీ లేదు. 2014 లో రాష్ట్ర విభజన జరిగాక, ఇప్పుడు ఈ ప్రాంతం మీద ప్రభుత్వం ‘ఫోకస్’ పడింది గానీ, లేకుంటే ఈ ప్రాంత పరిస్థితిని వూహించడం కష్టం. ‘వెలుగొండ’ ప్రాజెక్టు పూర్తి అయ్యాక, సాగులోకి రానున్న 4,47,300 ఎకరాల భూములకు ఇన్నేళ్లకు విలువ పెరగనుంది. కృష్ణా నది సహజ ప్రవాహాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన దారి మళ్ళించి నల్లమల అడవుల గర్భం లోపల నుండి కొండకు వేసిన సొరంగ మార్గం ద్వారా, త్వరలో నదీ జలాలు ఇకముందు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న నిత్య కరువు ప్రాంతానికి తరలివస్తాయి. తూర్పు కనుమల్లో నల్లమల అరణ్యం అంచుల్లో ఇప్పటివరకు సాగు జలాలు అందని ఇంత పెద్ద విస్తీర్ణం ఇకముందు సాగులోకి వస్తుంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 30 మండలాలోని 15.25 లక్షల మంది ప్రజలకు తాగునీరు సాకర్యం లభిస్తుంది. ఏకకాలంలో ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి మధ్యకోస్తా ప్రాంతాన్నే కాకుండా రాయలసీమ జిల్లాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతిపాదిత ‘మెరైన్ బోర్డ్’ వచ్చాక రామాయపట్నం, దుగ్గరాజపట్టణం పోర్టులకు రవాణా కోసం అనుసంధానం అయ్యే ఈ ప్రాంతం రూపురేఖలు చాలా తక్కువ కాలంలో మారిపోతాయి అనడంలో ఆశ్చర్యం లేదు. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక వ్యాఖ్యాత -
శనగ రైతులు పిచ్చోళ్లు!
-
శనగ రైతులు పిచ్చోళ్లు!
* మూడేళ్లపాటు నిల్వలు పెట్టి.. నన్ను పిచ్చోడ్ని చేస్తారా? * ప్రకాశం జిల్లా పర్యటనలో మండిపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు * డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అంటూ ఆగ్రహం * ఒంగోలులో వర్సిటీలు, ఎయిర్‌పోర్టులు పెడతామంటూ హామీలు * డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకానికి త్వరలో ‘ఈ-కామర్స్’ విధానం సాక్షి, ఒంగోలు, హైదరాబాద్: ‘నిజంగా ప్రకాశం జిల్లా శనగ రైతులు పిచ్చోళ్లయ్యా... ఒకటీ రెం డే ళ్లుకాదు.. మూడేళ్లపాటు సరైన ధరల్లేవని నిల్వ లు పెట్టారు. ఒకట్రెండేళ్లపాటు నష్టాలొస్తే ఆమాత్రం భరించలేరా..? ఇప్పుడేమో ప్రభుత్వం మెడపై కత్తిపెట్టినట్లు నన్ను పిచ్చోడ్ని చే యాలని చూస్తున్నారు.’’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చం ద్రబాబు మంగళవారం ప్రకాశం జిల్లా పర్యటన లో రైతులపై విరుచుకుపడ్డారు. పర్చూరు నియోజకవర్గం నాగులపాలెంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో ఆయన ముఖాముఖి నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు శనగ రైతులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 17 లక్షల క్వింటా ళ్ల శనగలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయని, అందులో 7.5 లక్షల క్వింటాళ్లు మంచిరకం కిందకొస్తాయని చెప్పారు. సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతుల కోసం.. ప్రజలతో కొనిపించలేం.. రైతుల వినతిపై చంద్రబాబు స్పందిస్తూ ‘శనగరైతులు ఏళ్లపాటు పంటను నిల్వపెట్టుకుని, ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తే మా దగ్గర డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా..?’ అన్నారు. జనాలు ఉచితంగా పంపిణీ చేస్తే ఏై మెనా తీసుకుంటారని, రైతుల కోసం శనగలు కొనాలని చెప్పలేం కదా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతానికి శనగల రైతులకు తానేమీ న్యాయం చేయలేనని, నాఫెడ్ కూడా కొనుగోలుకు చేతులెత్తేసిందన్నారు. రుణ మాఫీ అమలుపై ప్రభుత్వం తాత్సారం చేయడంతో బ్యాంకర్లు కోల్డ్‌స్టోరేజీ ల్లోని శనగల వేలానికి దూకుడు చూపుతున్నారని రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే వేలాన్ని నిలిపివేయాలని ఆదేశాలిస్తామని సమాధానమిచ్చారు. అంతకుముందు వైఆర్ఎస్ పాఠశాలలో ‘బడిపిలుస్తోంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. రానున్న కాలంలో సోషల్ వెల్ఫే ర్ హాస్టళ్లను మూసివేసి రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని, మండలాల్లో క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటుచేసి పేదవిద్యార్థుల తరలింపునకు వాహనాల సదుపాయం కూడా పెడతామని చంద్రబాబు హామీనిచ్చారు. ఒంగోలులో వెటర్నరీ యూనివర్శిటీ.. పర్చూరు, ఒంగోలు జన్మభూమి బహిరంగ సభ ల్లో చంద్రబాబు మాట్లాడుతూ ఒంగోలు గిత్త జా తిని కాపాడేందుకు తగిన కృషి చేస్తామని, ఇక్కడ వెటర్నరీ యూనివర్శిటీ నెలకొల్పుతామన్నారు. జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటుతో పాటు దొనకొండను పెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఒంగోలులో ఎయిర్‌పోర్టుతోపాటు రామాయపట్నం పోర్టు, కనిగిరిలో జాతీయ పారిశ్రామికవాడ అందుబాటులోకి తె స్తామన్నారు. వెలిగొండ, రామతీర్థం జలాశయం ప్రాజెక్ట్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి ప్రణాళిక సిద్ధమైందన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాల్లో ‘ఈ-కామర్స్’ విధానం అమలు చేస్తామన్నారు. కార్యక్రమాల్లో జిల్లామంత్రి శిద్దా రాఘవరావుతో పాటు పర్చూరు, ఒంగోలు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్దన్, ఎంపీ పులి వర్తి మాల్యాద్రి, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ ఎంపీ కరణం బలరాం, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జులు పాల్గొన్నారు. వెంటనే మాట మార్చిన సీఎం శనగ రైతులను ఆదుకుంటామని ఒంగోలు జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. పర్చూరు పర్యటనలో శనగరైతులు తనకు పిచ్చి పట్టిస్తున్నారంటూ మాట్లాడిన సీఎం.. ఒంగోలు కు వచ్చేసరికి పూర్తిగా మాట మార్చారు. జిల్లాలో మూడేళ్లుగా శనగలను నిల్వ ఉంచుకొని రైతులు పడుతున్న కష్టాలు చూస్తే బాధేస్తోందని, వారిని ఆదుకుంటామని అన్నారు. క్వింటాల్ ఒక్కింటికి రూ.3,100లు చొప్పున ఎంఎస్పీ ధరకు శనగలను కొంటామని, మధ్యాహ్న భోజన పథకం లో, హాస్టళ్ల మెనూలో చేరుస్తామన్నారు. చౌక ధ రల దుకాణాల ద్వారా శనగలను విక్రయించి రైతుకు అండగా నిలుస్తామని అన్నారు. వేలం వేసేందుకు బ్యాంకర్లు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని శనగలను ప్రభుత్వం కొనగానే వాటికి డిమాండ్ వస్తుంద ని, దాంతో రైతుల కష్టాలు తీరతాయని వ్యాఖ్యానించారు. శనగల కొనుగోలుపై కేంద్రానికి లేఖ : సీఎం రాష్ట్రంలోని ఐదు జిల్లా ల్లో పేరుకుపోయిన శనగల కొనుగోలుపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. శనగ రైతు లు పడుతున్న కష్టాలకు పరిష్కారం చూపాలని కోరారు. శనగ రైతులు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లా పర్యటనకు పోబోయే ముందు ఆయన మంగళవారమిక్కడ వ్యవసాయ, మార్కెటింగ్, ఇతర శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.