Prakash agarwal
-
ఇంజనీర్‌పై దాడి కేసులో ‘ఆప్’ ఎమ్మెల్యే అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: తన మాట వినలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు (డీజేబీ) అధికారిపై చేయిచేసుకున్నందుకు ఢిల్లీ పోలీసులు దేవ్లీ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. తమ ఇంజనీర్ అరుణ్‌కుమార్‌పై ఆప్ ఎమ్మెల్యే, ఆయన మనుషులు దాడి చేశారని డీజేబీ సంగంవిహార్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే జార్వాల్‌ను అరెస్టు చేశామని డీసీపీ కరుణాకరణ్ తెలిపారు. సంగంవిహార్ ప్రాంతంలో ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ పనులను పర్యవేక్షిస్తున్న జూనియర్ ఇంజనీర్ అరుణ్‌కుమార్‌పై ఎమ్మెల్యే, అతని గూండాలు దాడి చేశారని డీజేబీ ఆరోపించింది. ‘గురువారం ఉదయం ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ ప్రారంభించాం. అయితే డ్రిల్లింగ్‌ను నిలిపివేయవలసిందిగా ఎమ్మెల్యే సన్నిహితుడొకరు అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి చెప్పాడు. ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించకుండా ఏ పని మొదలుపెట్టకూడదని ఆ వ్యక్తి చెప్పాడు. తవ్వకాలను మధ్యలోనే ఆపివేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడమేగాక డ్రిల్లింగ్ పనుల్లో జాప్యమేర్పడుతుంది. అందుకే అరుణ్‌కుమార్ పనుల కొనసాగింపునకు ఆదేశించారు’ అని డీజేబీ పేర్కొంది. ఆ తరువాత ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే తన మనుషులతో వచ్చి అరుణ్‌కుమార్‌పై చేయిచేసుకున్నారని, ఫలితంగా ఆయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చిందని డీజేబీ తెలిపింది. -
పశ్చిమలో ఎలా ఉంది?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ హడావుడి వేడెక్కుతోంది. ఇప్పటికే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ పరిస్థితిని అధిష్టానం దూత ప్రకాశ్ ఎల్గుల్వర్ సమీక్షించిన సంగతి తెలిసిందే. తాజాగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ పరిశీలకుడు కేబీ కోలివాడ్ జిల్లాకు రానున్నారు. ఇప్పటికే ఆయన పర్యటన తే దీలు ఖరారు కావడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పార్టీ పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక నేతలతో సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా బలాబలాలు ప్రదర్శించి అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ సమీక్షపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఆయనపై ఉన్న అభిప్రాయాలను పరిశీలకుడికి వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 19నుంచి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరీశీలకుడు కే బీ కోలివాడ్ గాంధీభవన్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. 19వ తేదీన తాండూరు, వికారాబాద్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. 20వ తేదీన మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలు, 21న పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆ తర్వాత జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు మాజీ ఎంపీలు, శాసనసభ సభ్యులు, డీసీసీ మాజీ అధ్యక్షులు, జెడ్పీటీసీ మాజీ సభ్యులతో భేటీ కానున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ షెడ్యూల్‌ను వెల్లడించారు. -
వేగు వచ్చాడు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. గెలుపు గుర్రాల అన్వేషణకు వేగులను రంగంలోకి దింపింది. జిల్లాలో పార్టీ పరిస్థితి అంచనాకు అధిష్టానం దూతను పంపింది. ఏఐసీసీ నియమించిన పార్టీ పరిశీలకుడు ప్రకాశ్ ఎల్గుల్వర్ సోమవారం గాంధీభవన్‌లోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌తో భేటీ అయ్యారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి పరిశీలకుడిగా వచ్చిన ప్రకాశ్.. నియోజకవర్గం పరిధిలో పార్టీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ ముఖ్యులతో సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు. మల్కాజిగిరి పార్లమెంటరీ సెగ్మెంట్లోని ఏడు శాసనసభ స్థానాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతల పనితీరు, ఆశావహుల జాబితాను ఆరా తీసిన ప్రకాశ్.. ప్రత్యర్థుల బల బలాలపై స్థూలంగా కసరత్తు చేసినట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తె లిసింది. రాష్ట్ర విభ జనతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ, జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఎన్నికల్లోనే తేలుతుందని ఒకరిద్దరు నేతలు ఆయనతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సహా జిల్లా ఇన్చార్జి ప్రేమ్‌లాల్ పరిశీలకుడితో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బాధ్యులతో జరిపే అభిప్రాయ సేకరణకు సంబంధించిన తేదీలను ఖ రారు చేశారు. ప్రతి రోజూ రెండు లేదా మూడు సెగ్మెంట్ల నేతలతో భేటీ కానున్నారు. 9న ఉదయం 10:30 గంటలకు మేడ్చల్, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజిగిరి, 10న ఉదయం కుత్బుల్లాపూర్, మధ్యాహ్నం కూకట్పల్లి, సాయంత్రం 4 గంటలకు ఉప్పల్, 11న ఉదయం ఎల్బీనగర్, మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నాయకులతో సంప్రదింపులు జరుపనున్నారు. ఆయా నియోజకవర్గాల నాయకులతో అభిప్రాయసేకరణ జరిపి ఆ నివేదికను అధిష్టానానికి నివేదించనున్నారు.