ఆగిన దురంతో ఎక్స్ప్రెస్
వేటపాలెం: ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దురంతో ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. చెన్నై నుంచి విజయవాడకు వెళ్తుండా ప్రకాశం జిల్లా వేటపాలెం సమీపంలో సోమవారం రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అధికారులు రైలు పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాగా రెండు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ రూట్లో ప్రయాణిస్తున్న రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది.