రోడ్డున పడిన 3లక్షల మంది కార్మికులు
కొత్తవలస రూరల్: కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకుం టున్న నిర్ణయాలతో భారతదేశంలో 3 లక్షల మంది జూట్ కార్మికులు రోడ్డున పడ్డారని వారి ఉపాధికి వేటు పడిందని రాష్ట్ర ఇప్టూ ఉపాధ్యక్షుడు పి ప్రసాద్ ఆందోళన వ్యక్తంచేశారు. కొత్తవలస మండలంలో మూతపడిన ఉమా జూట్ ట్విన్ మిల్స్ మూడు మిల్లుల కార్మికుల స మస్యలు తీర్చేందుకు బుధవారం ఏర్పాటుచేసిన సాధారణ సమావేశాన్ని ఇప్టూ రాష్ర్టకార్యదర్శి పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రసాధ్ మాట్లాడుతూ భారత దేశంలో వస్త్ర రంగం తరువాత జూట్ పరిశ్రమకు 170 సంవత్సరాల చరిత్ర ఉందని, తరతరాలుగా జూట్ పరిశ్రమను నమ్ముకుని లక్షలాది కుటుంబాలు దేశంలో మనుగడ సాగిస్తున్నాయన్నారు. నేడు ప్రధాని మోది సర్కారు అంబానీకి మద్దతుగా సింథటిక్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తోందని, రాష్ట్రం లో చంద్రబాబు నాయుడు ఉపాధి తక్కువగా ఉన్న రసాయన పరిశ్రమలు స్దాపించేందుకు విదేశీకంపెనీలకు ఆహ్వానిస్తున్నారని దీనివల్ల రాష్ట్రంలో జూట్ పరిశ్రమలు మూతపడ్డా వారికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.
ఇఫ్టూ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీసీఎల్, ఏసీఎల్ చర్చలకు రాకుండా మిల్లు యాజమాన్యం తప్పించుకు తిరుగుతోందని అందుకే కార్మికుల సమక్షంలో మూడు మిల్లులకు జనరల్‌బాడీ వేశామని త్వరలోనే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కార్య్రకమంలో ఇప్టూ నాయకులు వై.కొండయ్య, మిల్లుల సంఘ నాయకులు అప్పారావు, కె.శ్రీను, అడపా వెంకటరావు, దేముడు బాబు మూడుమిల్లుల కార్మికులు పాల్గొన్నారు.
ఉమాజూట్మిల్లుల కార్యవర్గం ఎంపిక
కొత్తవలస రూరల్: మండలంలోని తుమ్మికాపల్లి ఉమాజూట్ ట్విన్మిల్స్, చింతలదిమ్మవద్ద గల ఉమాజూట్ ప్రోడక్ట్,్ర సాయిరాం ప్రోడక్ట్సుకు చెందిన మూడుమిల్లుల కార్మికులు బుధవారం జనరల్‌బాడీ మీటింగ్ ఏర్పాటుచేసి ఇప్టూ జిల్లా కమిటీ కి నూతన కార్యవర్గం ఏర్పాటుచేశారు. ఉమాజూట్మిల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షునిగా ఎల్లపు అప్పారావు, కార్యదర్శిగా అడపా వెంకటేశ్వరావు, కోశాధికారిగా సిహెచ్ సత్యం, ఉమాజూట్ ప్రోడక్స్ట్వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షునిగా ఎల్ త్రిమూర్తులు, కార్యదర్శిగా కె శ్రీను, కోశాధికారిగా దర్గా, సాయిరాం ప్రోడక్ట్స్ట వర్కర్క్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా జి నాయుడు, కార్యదర్శిగా టి రామమ్మ, కోశాధికారిగా కాసులమ్మను ఎంపికచేశారు. జిల్లాకమిటీ అధ్యక్షులుగా కొమ్ము నాగభూషణరావు, డి.శ్రీనులను ఎంపికచేశారు.