200 సినిమాల్లో నటించా
దేవరాపల్లి: టాలీవుడ్లో సుమారు 200 సినిమాల్లో ఇప్పటి వరకు నటించానని క్యారెక్టర్ ఆర్టిస్టు ఐనవోలు ప్రసన్నకుమార్ తెలిపారు. దేవరాపల్లి 21 శిరస్సుల భారీ మట్టి వినాయకుని నిమజ్జనమహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1972లో తొలుత ‘పరీక్షలు లేవు’ నాటకంలో రంగ స్థలంపై ఆరంగ్రేటం చేసి, ఏయూ థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది మొదటగా ‘జోగి జాతర ’ నాటకంలో గవర్నర్ ప్రశంసలు అందుకున్నానన్నారు. చిత్ర పరిశ్రమలో వెనుకకు తిరిగి చూడకుండా పలు చిత్రాలలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షలకు అభిమానాన్ని చూరగొని దగ్గరయ్యానన్నారు.