breaking news
Prasanth Varma Cinematic Universe
-
ప్రశాంత్ వర్మ సినిమా.. శుక్రాచార్యుడిగా ప్రముఖ నటుడు
'హనుమాన్' సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'తో బిజీగా ఉన్నారు. అయితే, ఇదే చిత్రంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మహాకాళి చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇచ్చారు. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్న నటించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మహాకాళి సినిమాని చాలారోజుల క్రితమే ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ స్టోరీ మాత్రమే అందిస్తున్నారు. దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ ఖన్నా రీసెంట్గా వచ్చిన ఛావా సినిమాలో ఔరంగజేబు పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ హీరో మూవీగా మహాకాళి రానుందని ప్రచారం జరుగుతుంది.In the shadows of gods,rose the brightest flame of rebellion 🔥Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru @RKDStudios #RKDuggal #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/mclj39Q8z9— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025 -
ప్రశాంత్ వర్మ సర్ప్రైజ్.. సూపర్ హీరో మూవీ పోస్టర్ రిలీజ్
హనుమాన్ సినిమాతో వెండితెరపై అద్భుతాన్ని సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఈ ఒక్క మూవీతో అతడి పేరు మార్మోగిపోయింది. అంతేకాదు, తనదగ్గర 20 కథలు రెడీగా ఉన్నాయన్నాడు. వాటిని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తానన్నాడు. ఈ సినిమాలో సూపర్ హీరోలను చూస్తారన్నాడు.పవర్ఫుల్ పోస్టర్తాజాగా పీవీసీయూ (Prasanth Varma Cinematic Universe) నుంచి అధీర సినిమా పోస్టర్ వదిలారు. ఈ మూవీలో నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. నటుడిగా ఇదే అతడి తొలి చిత్రం కావడం విశేషం. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్లో అగ్నిపర్వతం బద్ధలైనట్లుగా చూపించారు. కల్యాణ్ సూపర్ హీరో గెటప్‌లో ఉన్నాడు.థియేటర్లలో అధీర గ్లింప్స్?ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు.. ఆశాకిరణం వెలుగులా పుట్టుకొస్తుందంటూ ప్రశాంత్ వర్మ అధీర పోస్టర్ షేర్ చేశాడు. అయితే ఈ మూవీకి దర్శకుడు ఈయన కాదు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సూపర్ విజన్‌తో ఈ మూవీ రాబోతోంది. దీనికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించిన ఓజీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. పనిలో పనిగా అధీర గ్లింప్స్‌ను ఓజీలో చూపించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. When darkness blooms the world, a LIGHTNING of hope emerges ❤️🔥Presenting @IamKalyanDasari and @iam_SJSuryah in #ADHIRA ⚡️A New SUPERHERO from #PrasanthVarmaCinematicUniverse 💥💥💥A @RKDStudios Production Presented By RK Duggal Directed By @sharandirects Produced By… pic.twitter.com/FSnovvMY5P— Prasanth Varma (@PrasanthVarma) September 22, 2025 చదవండి: హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై మనీష్ బిగ్‌బాంబ్