రైతుల కళ్లల్లో ఆనందమే ధ్యేయం
తిప్పర్తి, న్యూస్‌లైన్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించి రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే తన ధ్యేయమని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టులను 5 సంవత్సరాల్లో పూర్తి చేసి జిల్లా రైతులకు రెండు పంటలకు సాగునీరందిం చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆది వారం తిప్పర్తి మండల కేంద్రంలో విజ యోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే ఏఎంఆర్పీ కాల్వల ద్వారా ఒక కారుకు మాత్రమే నీరుందుతుందని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామానికో సబ్‌స్టేషన్ నిర్మిం చేందుకు తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. అలాగే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి, మండల కేంద్రంలో ఎస్సీల కోసం ప్రత్యేకంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా భూ సేకరణ చేసి మోడల్ కాలనీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
దీనితో పాటు రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రావు విగ్రహాల ఏర్పాటుతో పాటు తిప్పర్తి సెంటర్లో పార్కును ఏర్పాటు చేస్తానన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆస్పత్రిగా మార్చి ఎళ్లవేళలా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూస్తానన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ, జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయిస్తానన్నారు.
తిప్పర్తి మండల ప్రజల రుణం తీర్చుకోలేనిది
మరోమారు తనను ఎమ్మెల్యేగా గెలిపిం చేందుకు తిప్పర్తి మండల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని కోమటిరెడ్డి అన్నారు. ఈ మండల ప్రజ లను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని తెలిపారు. వారంలో నాలు గు రోజులు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. రోజు కో మండలంలోని ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడమే ధ్యేయంగా అభివృద్ధిపై దృష్టి సారిస్తానన్నారు. మం డలంలోని ఇండ్లూరు, సర్వారం గ్రామా ల్లో త్వరలో సబ్‌స్టేషన్ నిర్మాణాలను శంకుస్థాపన చేస్తానన్నారు.
జిల్లా కేం ద్రంలో మెడికల్ కాలేజీ శంకుస్థాపన కేసీఆర్‌తో చేయిస్తానని, అలాగే పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేయించేందుకు నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తానన్నారు. అం తకు ముందు తిప్పర్తి కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డిని ఘనంగా సన్మానిం చారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, డీసీసీబీ డెరైక్టర్ పాశం సంపత్‌రెడ్డి, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, పాశం రాంరెడ్డి, రావుల మల్లమ్మ -కొమురయ్య, జాకటి మోష, కిన్నెర అంజి, జూకురి రమేష్, లొడంగి వెంకటేశ్వర్లు, గుండా సత్యనారాయణ, పెరిక వెంకటేశ్వర్లు, ఆదిమూలం ప్రశాంత్, నాగేందర్, గుండు శ్రీను, కుంచం వెంక న్న, సల్వాది సైదులు, వనపర్తి రాము, ఎస్.సైదులు, చక్రవర్తి, కొండ్ర సైదులు, ఏనుగు నర్సిరెడ్డి, మురళి, నగేష్, శ్రీనివాస్, వెంకన్న, శ్రీనివాస్‌రెడ్డి, సైదు లు, ఎస్.కె.మహ్మద్ పాల్గొన్నారు.