ప్రత్తికోళ్లలంకలో కొనసాగుతున్న 144 సెక్షన్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో 144 సెక్షన్ కొనసాగుతోంది. చేపల పెట్టుబడిపై గ్రామంలోని రెండు గ్రామాల మధ్య వివాదం నెలకొంది. సుమారు 110 ఎకరాల చెరువుకు సంబంధించి గత రెండు రోజులుగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు శనివారం చెరువులో చేపలు పడుతుండగా ఎస్సీ వర్గీయులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఏలూరు తహసీల్దారు ప్రసాద్ ఘటనాస్థలికి చేరుకొని ఎలాంటి గొడవలు జరగకుండా ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. నిరసనగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు రోడ్డుపైనా వంటావార్పూ చేసి నిరసన కార్యక్రమాలు చేశారు.