వారితో సమంత స్పెషల్ దీపావళి!
నలుగురితో కలిసి పంచుకుంటూనే ఏ పండుగైనా అందంగా ఉంటుంది. ఆనందాన్ని పంచుతోంది. అందుకే చిన్నారుల మోములపై ఆనందపు వెలుగులు పూయిస్తూ.. వారితో కలిసి ఈ దివ్వెల పండుగను జరుపుకొంది సమంత. దీపావళి పండుగ సందర్భంగా తాను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘ప్రత్యూష’ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చిన్నారులతో ఆనందంగా గడిపింది సామ్. వారితో కలిసి సరదాగా కాకరవొత్తులు వెలిగిస్తూ.. ఆ నవ్వుల వెలుగుల దివాలీ ఫొటోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
నిరుపేద మహిళలు, చిన్నారులకు వైద్యసహాయం అందించేందుకు సమంత ‘ప్రత్యూష ఆర్గనైజేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. నిరుపేద చిన్నారులకు సాయం అందిస్తున్న ఈ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇటీవల మరో టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా పాల్గొన్నది.
ఇక అభిమానులను మురిపించడానికి ఒక అందమైన పార్టీ ఫొటోను కూడా సమంత ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది.