Pre-paid mobile recharge
-
మొబైల్ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ ప్రీ–పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన రూ. 599 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అదనంగా రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఈ రీచార్జ్ వేలిడిటీ 84 రోజులు ఉంటుందని, ప్రతీ రీచార్జ్‌తో పాటు బీమా కవరేజీ ఆటోమేటిక్‌గా మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపింది. 18–54 ఏళ్ల కస్టమర్లకు ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యపరీక్షలు అవసరం లేదని వివరించింది. దీన్ని ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టినట్లు, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ వివరించింది. -
బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్రీ పెయిడ్ ప్లాన్
సాక్షి, ముంబై : టెలికాం రంగంలో నెలకొన్న తీవ్ర పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.999తో రీచార్జ్ చేసుకుంటే ఒక ఏడాది పాటు రోజుకు ఒక జీబీ డేటా, ఆరు నెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్ వినియోగించుకోవచ్చు. డేటా పరిమితి దాటిన తర్వాత 40 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. ఇక ప్రతిరోజూ 100 ఎస్సెమెస్‌లు ఉచితంగా లభిస్తాయి. తాజా ఆఫర్‌తో బీఎస్ఎన్ఎల్ జియో, ఎయిర్‌టెల్‌లకు సవాలు విసిరినట్లే. -
ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు ట్విట్టర్ ద్వారా కూడా నగదును బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చని, ప్రి పెయిడ్ మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ చెప్పారు. ట్విట్టర్ ద్వారా నగదు బదిలీ చేసుకునే అవకాశాన్నందిస్తున్న తొలి ఆసియా బ్యాంక్ తమదేనని, అలాగే ప్రపంచంలో రెండవదని వివరించారు. ఈ సౌకర్యాన్ని పొందాలంటే తమ ట్విటర్ హ్యాండిల్లో నమోదు చేసుకోవాలని వివరించారు. నగదు బదిలీకి నగదు పంపించే వ్యక్తి, అవతలి వ్యక్తికి ట్విట్టర్ హ్యాండిల్ తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నగదు బదిలీ లావాదేవీ అనంతరం నగదును పంపించిన వ్యక్తికి యూనిక్ కోడ్‌తో కూడిన ఒక ఎస్ఎంఎస్ వస్తుందని, నగదు పొందే వ్యక్తి ఈ కోడ్‌ను స్పెషల్ వెబ్‌పేజీలో ఎంటర్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం నగదు బదిలీకి ఎన్ఈఎఫ్టీ(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్), ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) విధానాలను ఉపయోగిస్తున్నామని, త్వరలో ఐఎంపీఎస్(ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్)లో కూడా చేరతామని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా నగదు బదిలీకి ఎలాంటి చార్జీలు ఉండవని, నెఫ్ట్, ఆర్టీజీఎస్ చార్జీలు వర్తిస్తాయని వివరించారు. ఒక వేళ డబ్బులు పొందే వ్యక్తి వేరే బ్యాంక్ ఖాతాదారు అయితే, ఆ వేరే బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పనిసరిగా కోట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది ఫేస్బుక్ ద్వారా నగదు బదిలీ సౌకర్యాన్ని అందించామని చెప్పారు. ట్విట్టర్ ఇండియా బిజనెస్ హెడ్.. తరన్‌జిత్ సింగ్ ట్విట్టర్ ఇండియా బిజినెస్ హెడ్‌గా తరన్‌జిత్ సింగ్ నియమితులయ్యారు. భారత్‌లో ట్విట్టర్‌కు వాణిజ్య పరమైన అవకాశాలను పెంచడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తారని ట్విట్టర్ మేనేజింగ్ డెరైక్టర్ పర్మిందర్ సింగ్ చెప్పారు.