Preachers of hate
-
అతివాద బోధకులకు బ్రిటన్లోకి నో ఎంట్రీ
లండన్: పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ విద్వేష ప్రబో ధకులను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసిందని ‘డైలీ టెలీగ్రాఫ్’ తెలిపింది. తీవ్రవాద కార్యకలాపాలు ఊహించని రీతిలో పెరుగుతుండటం పట్ల బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చే అతివాద మత ప్రబోధకులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారి పేర్లను వీసా హెచ్చరిక జాబితాలో చేరుస్తారు. వీరికి దేశంలోకి ప్రవేశించే దారులు మూసుకుపోతాయని ‘డైలీ టెలీగ్రాఫ్’ పేర్కొంది. -
'విద్వేష ప్రబోధకులతో సమాజానికి ముప్పు'
నైరోబి: ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ముద్రల ప్రపంచమంతా విస్తరిస్తున్న నేపథ్యంలో కెన్యా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస, విద్వేష ప్రబోధకులు సమాజ సమగ్రతకు ముప్పుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాద భావజాలాన్ని ఎదుర్కొనేందుకు యువత సానుకూల భావజాలాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఢాకా ఉగ్రవాద పేలుళ్లకు కారణమయ్యారంటూ వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నైరుబీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఆర్థిక పురోగతి ఫలాలు ప్రజలకు అందాలంటే సమాజ భద్రత అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్రవాదులను రాజకీయ సాధనంగా వాడుకోవడాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద భావజాల నిరోధానికి కావాల్సిన సానుకూల భావజాలం పెంపొందించడంలో యువత కీలకపాత్ర పోషించాల్సిన అవసరముందని చెప్పారు.