pregnent wife
-
అనుమానంతో నిండు గర్భిణి అయిన భార్యను..!
సాక్షి, తూప్రాన్: అనుమానమే పెనుభూతమైంది. నిండు గర్భిణీ అనే విషయం విస్మరించిన భర్త గొడ్డలి వేటుతో పాశవికంగా హతమార్చాడు. ఈ అమానుష ఘటన తూప్రాన్ మండలం కిష్టాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాధకర సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా కప్రాలి గ్రామానికి చెందిన సవిత (35) అనే మహిళతో అదే జిల్లా సగ్రోలి గ్రామానికి చెందిన కొండపల్లి శివలింగు గంగారాంతో కోన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. కాగ గత నెల రోజుల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలోని సంతోష్‌రెడ్డి వ్యవసాయ పొలంలో వాచ్‌మెన్‌గా చేరాడు. అక్కడే వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలో భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నారు. అయితే అప్పటికే సవితకు ముగ్గురు పిల్లలు కాగ మళ్లీ గర్భం దాల్చింది. అయితే నిత్యం తన భార్యను అక్రమ సంబంధం పెట్టుకున్నావని వేదిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రించారు. అయితే అప్పటికే పథకం రూపొందించుకున్న భర్త శివలింగు గంగారాం అర్థరాత్రి అందరు పడుకున్న తర్వాత ఇంట్లోని గొడ్డలితో భార్య సవిత తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సవిత తలపై, మేడపై తీవ్రగాయాలు అయి తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ హత్యనుంచి తప్పించుకోవాలని పంట పొలంకు చెందిన సంతోష్‌రెడ్డికి ఫోన్లో తన భార్యను ఎవరో చంపి వేశారని ఫోన్లో నిందితుడు తెలిపినట్లు ఎస్ఐ తెలిపారు. అదే రాత్రి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చెరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని, మృతదేహన్ని పోస్టుమార్డం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. ముగ్గురు పిల్లలు అనాథలుగా మారడంతో వారిని అమ్మమ్మ వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. కాగ మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. -
నిండు గర్భిణీని కాళ్లతో తన్నిన భర్త
సాక్షి, విశాఖపట్నం : పెందుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణీ అని చూడకుండా ఆమె భర్త, అత్తలు చిత్రహింసలు పెట్టారు. ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి.. మార్గమధ్యలో తనను కడుపు మీద కాళ్లతో తన్నారని కన్నీటిపర్యంతమైంది. అంతేకాకుండా వారిద్దరు చున్నీతో గొంతు నులిమేశారని వాపోయింది. పాతిక లక్షలు తీసుకువస్తేనే.. పిల్లలను కనమని అంటున్నారని బాధితురాలు ఆరోపించింది. ఏడాదిన్నర కాపురంలోనే మూడుసార్లు అబార్షన్ చేయించారని తెలిపింది. తన భర్తకు పెళ్లికి ముందే మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంది. కడుపునొప్పి తీవ్ర కావడంతో సోదరుడి సాయంతో కేజీహెచ్‌కు తరలించినట్టు తెలుస్తోంది. -
గర్భిణిపై దాష్టీకం
కర్నూలు, నంద్యాల: ఎన్నో ఆశలతో పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన ఆమెకు ఏడాది తిరక్కముందే వేధింపులు మొదలయ్యాయి. మూడు నెలల గర్భం దాల్చినా వేధింపులుకట్నం తేకుంటే ఆపరేషన్ చేయించుకోవాలని ఒత్తిడి పెంచారు. ఆపరేషన్‌కు ససేమిరా అనడంతో భర్త, అత్త, మామ, మరిదులు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో ఆమె గర్భం కోల్పోయింది. టూటౌన్ సీఐ మంజునాథరెడ్డి తెలిపిన మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సాయిసురేఖకు గత ఏడాది ఆగస్టులో ప్రకాశం జిల్లా కొమరోలు మండల కేంద్రానికి చెందిన వెంకటేష్‌తో వివాహమైంది. వివాహ సమయంలో రూ.1.60 లక్షల నగదు, రూ.2.40 లక్షల విలువ చేసే బంగారంకట్నంగా ఇచ్చారు. పెళ్లయి కొన్ని నెలలు కూడా గడవకముందే అత్తింటి వారి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. రూ.10 లక్షలు తీసుకొని రావాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. దీంతో బాధితురాలు పుట్టింటికి వచ్చి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. పెద్దలు ఇరు కుటుంబాలను పిలిపించి పంచాయితీ చేశారు. కొద్ది సమయం ఇస్తే డబ్బు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపారు. ఆ తర్వాత సాయిసురేఖ గర్భం దాల్చింది. పిల్లలు పుడితే ఇక డబ్బులివ్వరన్న ఉద్దేశంతో మళ్లీ వేధింపులు మొదలుపెట్టారు. పిల్లలు కనడానికి వీల్లేదని, వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో భర్త వెంకటేష్, మామ సింహాచలం, అత్త గంగ, మరిదులు రమేష్, సుదర్శన్, మేనత్త కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో బాధితురాలు పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. వెంటనే వారు నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్ష చేయించారు. పిండం దెబ్బతినిందని, ఆపరేషన్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని తెలిపారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేయించారు. అలాగే ఈ విషయంపై సోమవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త, అత్త, మామ, మరిదులు, మేనత్తపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. -
భర్త కాదు కిరాతకుడు
బనశంకరి : ఆరు నెలల గర్భిణిని గొంతుకోసి హత్య చేసిన కిరాతక భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. హంతకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..హత్యోదతం వివరాలను బుధవారం మీడియాకు వివరించారు. తమిళనాడుకు చెందిన సత్యరాజ్‌కు నగరంలోని దొరసాని పాళ్యకు చెందిన శశికళతో 6 నెలల క్రితం వివాహమైంది. దంపతులు దొరసానిపాళ్యలోని బంధువుల ఇంట్లో ఉండేవారు. అయితే ఉమ్మడి కుటుంబంలో ఉండలేనని, అద్దె ఇంటికి మారాలని శశికళ డిమాండ్ చేస్తూ గొడవపడేది. ఇటీవల గర్భం దాల్చిన ఆమె భర్తతో నిత్యం గొడవపడేది. దీంతో భార్యను హత్యచేయాలని సత్యరాజ్ పథకం రచించాడు. మూడురోజుల క్రితం తిప్పగొండనహళ్లి జలాశయం వద్దకు తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశంలో శశికళను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని అటవీప్రదేశంలో పడేశాడు. తదనంతరం నగరానికి చేరుకొని శశికళ సెల్ తీసుకొని భార్యను బంధువుల ఇంటివద్ద వదిలిపెట్టి వెళుతున్నానని చెప్పి మెసేజ్ చేశాడు. అనంతరం పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో తన భార్య కనిపించలేదంటూ పిర్యాదు చేసి నాటకమాడాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యరాజ్ ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
భార్య, కుమారుడి గొంతు నులిమేశాడు!
కర్నూలు (టౌన్): వేరే అమ్మాయి మోజులో పడి మూడు నెలల గర్భిణి అయిన భార్యను, మూడేళ్ల కుమారున్ని ఓ కసాయి గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన మంగళవారం కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి ఉసేనయ్య, కర్నూలు నాలుగో పట్టణ సీఐ రామయ్యనాయుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన ఉదయభానును కర్నూలులోని సంపత్‌నగర్‌కు చెందిన ఆనంద్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి మూడేళ్ల కుమారుడు వినోద్ ఉన్నాడు. ప్రస్తుతం ఉదయభాను మూడు నెలల గర్భిణి. స్థానిక జ్యోతి మాల్లోపనిచేసే ఆనంద్.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను, బిడ్డను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. మంగళవారం ఉదయం తన భార్య, కుమారుడు చనిపోయారంటూ బంధువులకు, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిశితంగా పరిశీలించారు. మృతురాలి గొంతు మీద కందిపోయినట్లు ఉంది. దీంతో ఆనంద్‌పై అనుమానంతో అతన్ని స్టేషన్‌కు తరలించారు. అతనే భార్యను, కుమారున్ని గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పంచనామా ప్రకారం గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోందని, అయితే పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉందని నాలుగో పట్టణ సీఐ రామయ్యనాయుడు తెలిపారు. మృతురాలి తండ్రి ఉసేనయ్య ఫిర్యాదు మేరకు ఆనంద్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి విగత జీవులుగా మారిన కూతురు, మనవడిని చూసి ఉసేనయ్య కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
గర్భిణిని కత్తెరతో పొడిచిన భర్త
బజార్హత్నూర్(బోథ్): బజార్హత్నూర్ మండల కేంద్రంలోని యాదవ సంఘం భవన సమీపంలో నివాసం ఉంటున్న భార్యభర్తలు కుట్టల్‌వార్ దుర్గజీ, సునిత మధ్య గొడవ కత్తెరపోటుకు దారి తీసింది. మండలంలోని మాన్కపూర్ గ్రామానికి చెందిన కుట్టల్‌వార్ దుర్గజీ మండల కేంద్రంలో కుటుంబంతో పాటు నివాసం ఉంటూ పాలేరుగా పనిచేస్తున్నాడు. గత రెండు రోజులుగా భార్యభర్తలు గొడవ పడుతున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో నాలుగు నెలల గర్భవతి సునితతో గొడవకు దిగి అక్కడే ఉన్న బీడీల కత్తేరతో ఆమె పొత్తికడుపులో పొడిచాడు. సునిత చనిపోతుందని భావించిన దుర్గజీ ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ వైర్లను పట్టుకుని వేలాడాడు. కానీ ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో, కింద పడడంతో స్థానికులు వెంటనే భార్యభర్తలిద్దరినీ పీహెచ్‌సీకి, అటునుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. సునిత తల్లి జాడేవార్ రుక్మాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ఎస్ అబ్దుల్ మోబిన్ తెలిపారు. -
గర్భిణి భార్యను మోసుకుని ఆస్పత్రికి..
రాయ్‌గఢ్ (భువనేశ్వర్): అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో గర్భవతి అయిన భార్యను మోసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చిన ఘటన ఒడిశాలోని రాయ్‌గఢ్ జిల్లా కల్యాణసింగుపురం సమితిలో జరిగింది. కల్యాణసింగుపురానికి 6 కిలోమీటర్ల దూరంలో గల రాబుగుడ గ్రామానికి చెందిన అర్జునకురి భార్య రుయమణి గర్భిణి. ఆమె జ్వరంతో బాధపడుతుండడంతో భార్యను మోసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చాడు. దీనిపై సీడీఎంఓ డాక్టర్ ఆనందకుమార్ పాడిని వివరణ కోరగా, రబుగుడ గ్రామానికి వెళ్లేందుకు రహదారి లేదని తెలిపారు. రుయమణిని సైకిల్‌పై కూర్చోబెట్టి ఆస్పత్రి వరకు తీసుకువచ్చారని, ఆస్పత్రి ప్రాంగణం నుంచి లోపలికి మోసుకుని తీసుకువచ్చారని తెలిపారు. ఆమెకు వైద్యసేవలందించామని, ప్రస్తుతం జ్వరం తగ్గిందని, కోలుకుంటోందని తెలిపారు. కల్యాణసింగుపురం జిల్లాకేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.