గర్భిణి భార్యను మోసుకుని ఆస్పత్రికి.. | man carries pregnent wife to hospital in odisha | Sakshi
Sakshi News home page

గర్భిణి భార్యను మోసుకుని ఆస్పత్రికి..

Published Sat, Sep 17 2016 12:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

గర్భిణి భార్యను మోసుకుని ఆస్పత్రికి..

గర్భిణి భార్యను మోసుకుని ఆస్పత్రికి..

రాయ్‌గఢ్‌ (భువనేశ్వర్):
అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో గర్భవతి అయిన భార్యను మోసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చిన ఘటన ఒడిశాలోని రాయ్‌గఢ్‌ జిల్లా కల్యాణసింగుపురం సమితిలో జరిగింది. కల్యాణసింగుపురానికి 6 కిలోమీటర్ల దూరంలో గల రాబుగుడ గ్రామానికి చెందిన అర్జునకురి భార్య రుయమణి గర్భిణి. ఆమె  జ్వరంతో బాధపడుతుండడంతో భార్యను మోసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చాడు.

దీనిపై సీడీఎంఓ డాక్టర్‌ ఆనందకుమార్‌ పాడిని వివరణ కోరగా, రబుగుడ గ్రామానికి వెళ్లేందుకు రహదారి లేదని తెలిపారు. రుయమణిని సైకిల్‌పై కూర్చోబెట్టి ఆస్పత్రి వరకు తీసుకువచ్చారని, ఆస్పత్రి ప్రాంగణం నుంచి లోపలికి మోసుకుని తీసుకువచ్చారని తెలిపారు. ఆమెకు వైద్యసేవలందించామని, ప్రస్తుతం జ్వరం తగ్గిందని, కోలుకుంటోందని తెలిపారు. కల్యాణసింగుపురం జిల్లాకేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement