
సాక్షి, విశాఖపట్నం : పెందుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణీ అని చూడకుండా ఆమె భర్త, అత్తలు చిత్రహింసలు పెట్టారు. ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి.. మార్గమధ్యలో తనను కడుపు మీద కాళ్లతో తన్నారని కన్నీటిపర్యంతమైంది. అంతేకాకుండా వారిద్దరు చున్నీతో గొంతు నులిమేశారని వాపోయింది.
పాతిక లక్షలు తీసుకువస్తేనే.. పిల్లలను కనమని అంటున్నారని బాధితురాలు ఆరోపించింది. ఏడాదిన్నర కాపురంలోనే మూడుసార్లు అబార్షన్ చేయించారని తెలిపింది. తన భర్తకు పెళ్లికి ముందే మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంది. కడుపునొప్పి తీవ్ర కావడంతో సోదరుడి సాయంతో కేజీహెచ్‌కు తరలించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment