Prem Kumar Movie
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా
ఓ రేంజులో హిట్ అయితే తప్పితే తెలుగు సినిమాలన్నీ దాదాపు నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని మాత్రం అందరూ మర్చిపోయిన తర్వాత స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అలానే థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన చిత్రం... ఆల్మోస్ట్ రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో రిలీజైంది? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు) ఈ సినిమా సంగతేంటి? తెలుగు యంగ్ హీరోల్లో సంతోశ్ శోభన్ ఒకడు. హిట్ కోసం చాన్నాళ్ల నుంచి కష్టపడుతున్నాడు. అలా ఆగస్టు 18న తను నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. పెళ్లి కూతురు లేచిపోతే పీటల మీద ఓ పెళ్లి కొడుకు మిగిలిపోతాడు. అలాంటి పెళ్లి కొడుకు కథే ఈ ప్రేమ్ కుమార్. అయితే కాన్సెప్ట్ పరంగా కొత్తగా ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి చూసేయొచ్చు. ఏ ఓటీటీలో? సంతోశ్ శోభన్, రుచిత సాధినేని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. శుక్రవారం(అక్టోబరు 13) నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోయింది. ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏదైనా తెలుగు సినిమా చూద్దామని అనుకుంటే 'ప్రేమ్ కుమార్'ని ట్రై చేయొచ్చు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
‘ప్రేమ్ కుమార్ ’మూవీ రివ్యూ
టైటిల్ : ప్రేమ్ కుమార్ నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్ తదితరులు నిర్మాణ సంస్థ: సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత: శివప్రసాద్ పన్నీరు రచన, దర్శకత్వం: అభిషేక్ మహర్షి సంగీతం: ఎస్. అనంత్ శ్రీకర్ సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం విడుదల తేది: ఆగస్ట్ 18, 2023 కథేంటంటే.. ప్రేమ్ కుమార్(సంతోష్ శోభన్), నేత(రాశి సింగ్)కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. కాసేపట్లో మూడు ముళ్లు పడతాయనగా.. మండపంలోకి రైజింగ్ స్టార్ రోషన్ బాబు(కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. నేత్రని ప్రేమిస్తున్నాని చెప్పి.. మండపంలో నుంచి ఆమెను తీసుకెళ్తాడు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్‌కి పిల్ల దొరకదు. పెళ్లి చూపులకు వెళ్లడం.. క్యాన్సిల్ అవ్వడం ఇదే తంతు. చివరకు పెళ్లిపై విరక్తి వచ్చి.. స్నేహితుడు సుందరలింగం(కృష్ణ తేజ)తో కలిసి ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ని స్టార్ట్ చేస్తాడు. లవర్స్‌ని విడగొట్టడం..పెళ్లి క్యాన్సిల్ చేయడం.. భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటే..వారిని దూరం చేయడం వీళ్ల పని. భార్యలపై అనుమానం చాలా మంది ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ని కలుస్తారు. ఇలా డబ్బలు సంపాదిస్తూ ఆనందంగా ఉంటున్న ప్రేమ్ కుమార్ జీవితంలోకి మళ్లీ నేత్ర వస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? రైజింగ్ స్టార్ రోషన్, నేత్రను కాదని అంగనా(రుచితా సాధినేని)ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యాడు? విషయం తెలుసుకున్న నేత్ర ఏం చేసింది? నేత్ర పెళ్లి చెడగొట్టమని ప్రేమ్ కుమార్‌తో డీల్ కుదుర్చుకున్నదెవరు? ఇంతకీ ప్రేమ్ కుమార్‌కి పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ప్రేమ్ కుమార్ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ ‘చాలా సినిమాల్లో క్లైమాక్స్‌లో పెళ్లి జరుగుతుంటుంటే హీరో వచ్చి.. హీరోయిన్ తండ్రికి నాలుగు నీతి వ్యాఖ్యాలు చెప్పడం.. అతను ఎమోషనల్ అయి తన కూతురిని హీరోకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. కానీ అక్కడ ఒకడు మాత్రం అలా బొమ్మలా నిలబడిపోతాడు. వాడి పరిస్థితి ఏంటి? ఎంత మందికి కార్డులిచ్చాడో.. ఎన్ని అప్పులు చేశాడో..బట్టలు ఎలా కొనుకున్నాడో?.. అనే విషయాలను ఎవరూ పట్టించుకోరు. అలాంటి వాడిపై దర్శకుడు అభిషేక్ చేసిన సినిమానే ‘ప్రేమ్ కుమార్’. వినడానికి ఇది ఆసక్తికరమైన పాయింటే అయినా..దానిని తెరపై చూపించడం దర్శకుడు కాస్త తడబడ్డాడు.అభిషేక్ మహర్షి రాసుకున్న కథలో విషయం ఉంది కానీ కథనం మాత్రం అంత ఆసక్తికరంగా ముందుకు సాగదు. ప్రేమ్ కుమార్, నేత్రల పెళ్లి ఆగిపోయే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఎలాంటి సాగదీత లేకుండా తొలి సీన్‌తోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది చూపించాడు. హీరో పెళ్లి కోసం తల్లి తాపత్రాయపడడం.. అవి క్యాన్సిల్ అవడం..మధ్యలో మందు పార్టీ.. ఇలా రొటీన్ సన్నివేశాలతో కథనం ముందుకు సాగుతుంది. ‘పీకే డిటెక్టివ్ ఏజెన్సీ’ ఏర్పాటు చేసిన తర్వాత కథపై కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది. అక్కడ కూడా కామెడీకి చాలా స్కోప్ ఉన్నా..దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. అంగనా పాత్ర ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత కథనం ఎలా సాగుతుందో ఊహించొచ్చు. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది కానీ ప్రధాన పాత్రల మధ్య ఉన్న సంఘర్షణను బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఈ సినిమా థియేటర్లో ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. ఓటీటీ ప్రేక్షకులను కాస్త ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది. ఇక నటీనటుల విషయాలకొస్తే.. ఎప్పటిమాదిరే సంతోష్ శోభన్ తన న్యాచురల్ యాక్టింగ్‌తో ప్రేమ్ కుమార్ పాత్రకు న్యాయం చేశాడు. కృష్ణతేజతో కలిసి చేసే కామెడి హిలేరిస్‌గా ఉంటుంది. నేత్రగా రాశి సింగ్, అంగనాగా రుచితా సాధినేని ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక హీరో మేనేజర్ డాడీ పాత్రలో సుదర్శన్ పండించిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. హీరో రోషన్ బాబుగా కృష్ణ చైతన్య పర్వాలేదు. హీరో తల్లిగా సురభి ప్రభావతి, హీరోయిన్ తండ్రిగా రాజ్ మాదిరాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు. -
అలాంటి పెళ్లి కొడుకు కథే ఈ 'ప్రేమ్ కుమార్': డైరెక్టర్ అభిషేక్ మహర్షి
సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు. సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. లవ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి పలు ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చారు. సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. ఓటీటీలో షోలకి కూడా రాశాను. 'పేపర్ బాయ్' పూర్తయిన టైంలోనే సంతోష్ శోభన్ని కలిశాను. ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. అలా చివరకు సినిమా చేశాం. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లోంచి ఓ కథను ఎంచుకున్నాం. చివరకు 'ప్రేమ్ కుమార్' కథ సెట్ అయింది. నా కామెడీ టైమింగ్‌ను సంతోష్, శివ బాగా నమ్మేవారు. (ఇదీ చదవండి: 'బేబీ' బ్యూటీని ఎవరూ పట్టించుకోవట్లేదా.. లేదంటే?) సినిమాల్లో పెళ్లి సీన్లో చివర్లో హీరో వచ్చి, హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ ప్రేమ్ కుమార్ సినిమాను తీశాం. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా టీజర్ చూసినప్పుడు కాస్త భయపడ్డాను. ఇదేంటి నా కాన్సెప్ట్ లాగా ఉందే అని అనుకున్నాను. కానీ ఆ మూవీ దర్శకుడితో మాట్లాడాక.. కాన్సెప్ట్ వేరే అని అర్థమైంది. కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే లాంటి సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయి ఈ కథ రాశాను. మగాడికి పెళ్లి అయితే జీవితం నాశనం అవుతుంది. పీఠల మీదే పెళ్లి ఎలా ఆగిపోతుందని చాలా రకాలుగా ఆలోచించి రాశాను.. బయట కూడా అలాంటి ఘటనలే జరిగాయి. దీని తర్వాత కొత్త సినిమా త్వరలో ఉంటుంది. సెప్టెంబరులోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని అభిషేక్ మహర్షి చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) -
ప్రేమ్‌కుమార్..కడుపుబ్బా నవ్విస్తాడు: సంతోష్ శోభన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ప్రేమ్‌కుమార్ అని, దీనిలో కామెడీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవిస్తుందని ఆ సినిమా హీరో సంతోష్‌శోభన్ అన్నారు. ఈ నెల 18న విడుదల కానున్న ప్రేమ్‌కుమార్ చిత్రయూనిట్ సభ్యులు ఆదివారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సంతోష్‌శోభన్ మాట్లాడుతూ పెళ్లి కోసం పాట్లు పడే క్యారెక్టర్లో తాను కొత్తగా కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రాశీసింగ్, రుచిత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని తెలిపారు. వారిలో ఎవరితో పెళ్లి జరుగుతుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. ఈ చిత్రంలో నటించిన వారందరూ వారి పాత్రలకు తగిన న్యాయం చేశారన్నారు. విజయవాడ నుంచి తమ చిత్రం ప్రమోషన్ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్గా నిర్మించినట్లు పేర్కొన్నారు. హీరోయిన్ రాశీసింగ్ మాట్లాడుతూ తన మొదటి చిత్రం సంతోష్ శోభన్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సహనటుడు కృష్ణచైతన్య, అనిరుద్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.