అలాంటి పెళ్లి కొడుకు కథే ఈ 'ప్రేమ్ కుమార్': డైరెక్టర్ అభిషేక్ మహర్షి | Prem Kumar Movie Diector Abhisekh Maharshi Interview | Sakshi
Sakshi News home page

Prem Kumar Movie: 'ప్రేమ్ కుమార్' కుటుంబమంతా చూడదగ్గ సినిమా

Published Mon, Aug 14 2023 9:12 PM | Last Updated on Mon, Aug 14 2023 9:13 PM

Prem Kumar Movie Diector Abhisekh Maharshi Interview - Sakshi

సంతోష్ శోభ‌న్ హీరోగా నటించిన సినిమా 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తీసిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి పలు ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చారు.

సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. ఓటీటీలో షోలకి కూడా రాశాను. 'పేపర్ బాయ్' పూర్తయిన టైంలోనే సంతోష్ శోభన్‌ని కలిశాను. ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. అలా చివరకు సినిమా చేశాం. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లోంచి ఓ కథను ఎంచుకున్నాం. చివరకు 'ప్రేమ్ కుమార్' కథ సెట్ అయింది. నా కామెడీ టైమింగ్‌ను సంతోష్, శివ బాగా నమ్మేవారు.

(ఇదీ చదవండి: 'బేబీ' బ్యూటీని ఎవరూ పట్టించుకోవట్లేదా.. లేదంటే?)

సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి, హీరోయిన్‌ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ ప్రేమ్ కుమార్ సినిమాను తీశాం. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా టీజర్ చూసినప్పుడు కాస్త భయపడ్డాను. ఇదేంటి నా కాన్సెప్ట్ లాగా ఉందే అని అనుకున్నాను. కానీ ఆ మూవీ దర్శకుడితో మాట్లాడాక.. కాన్సెప్ట్ వేరే అని అర్థమైంది.

కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే లాంటి సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయి ఈ కథ రాశాను. మగాడికి పెళ్లి అయితే జీవితం నాశనం అవుతుంది. పీఠల మీదే పెళ్లి ఎలా ఆగిపోతుందని చాలా రకాలుగా ఆలోచించి రాశాను.. బయట కూడా అలాంటి ఘటనలే జరిగాయి. దీని తర్వాత కొత్త సినిమా త్వరలో ఉంటుంది. సెప్టెంబరులోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని అభిషేక్ మహర్షి చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement